NTV Telugu Site icon

Nikhil: వారం రోజుల్లో సినిమా రిలీజ్… ప్రమోషన్స్ మాత్రం చాలా వీక్

Spy Movie Release Date

Spy Movie Release Date

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అతి తక్కువ బడ్జట్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఏకైక హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవలే నిఖిల్ అనౌన్స్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నవే. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్న నిఖిల్, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇదే జోష్ ని మైంటైన్ చేస్తూ నిఖిల్ నుంచి జూన్ 29న రిలీజ్ కానున్న సినిమా ‘స్పై’. ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా మారి చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ కాన్స్పిరసీతో సినిమా వస్తుంది అనే స్టేట్మెంట్ ఇచ్చి స్పై మూవీ టీం ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసారు. టీజర్ తో కూడా ఆడియన్స్ ని మెప్పించిన స్పై సినిమాతో నిఖిల్ సెకండ్ పాన్ ఇండియా హిట్ అందుకోవడం గ్యారెంటీ అని ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యారు.

ఇలాంటి సమయంలో నిఖిల్, తన ఫ్యూచర్ సినిమాలని కూడా దృష్టిలో పెట్టుకోని స్పై సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చెయ్యాలి కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అది ఎందుకో జరగట్లేదు. మేకర్స్ నుంచి క్వాలిటీ ఇష్యూ ఉందొ లేక మరేదైనా ఇష్యూ ఉందా అనేది తెలియదు కానీ నిఖిల్ సినిమాకి ఉండాల్సిన హైప్ అండ్ ప్రమోషనల్ స్ట్రాటజీ స్పై కి లేకుండా పోయాయి. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చెయ్యాల్సి ఉండగా టెక్నీకల్ ఇష్యూస్ కారణంగా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. ఇలా ఈ సినిమాకే ఎందుకు జరుగుతుంది అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. అయితే వారం రోజుల్లో రిలీజ్ ఉన్న ఈ సినిమాకి ఇప్పటికప్పుడు బజ్ జనరేట్ చేసే కంటెంట్ బయటకి రావాలి. మరి అది ఏమవుతుంది అనేది చూడాలి, ఏ మాత్రం బజ్ జనరేట్ చెయ్యడంలో స్పై సినిమా ఫెయిల్ అయినా నిఖిల్ ఖాతాలో ఫ్లాప్ పడినట్లే అవుతుంది.

Show comments