Site icon NTV Telugu

Steven Spielberg: స్పీల్‌బెర్గ్ ‘హారీ పాటర్’కు ఎందుకు నో చెప్పాడు

Steven Rejects Harry Potter

Steven Rejects Harry Potter

Why Steven Spielberg Rejected Harry Potter: విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ నుండి ఓ సినిమా వస్తోందంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన తాజా చిత్రం ‘ద ఫేబుల్మన్స్’ ఆస్కార్ బరిలో పోటీకి సిద్ధమయింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ లంచన్ లో స్పీల్ బెర్గ్ తన చుట్టూ ఉన్నవారితో కొన్ని ముచ్చటించారు. అందులో ఆశ్చర్యం కలిగించే అంశమేదంటే ఆబాలగోపాలాన్నీ ఎంతగానో అలరించిన ‘హారీ పాటర్’ సిరీస్ లో మొదటి భాగాన్ని డైరెక్ట్ చేయమంటే స్పీల్ బెర్గ్ ‘నో’ అన్నాడట!

Producers Council Elections: రసవత్తరంగా నిర్మాతల మండలి ఎన్నికలు

ఓ విఖ్యాత దర్శకుడు, ఓ ప్రఖ్యాత నవల ఆధారంగా తెరకెక్కే సినిమాకు నో చెప్పడమంటే విశేషమే! పైగా ఆ సినిమాకు ఆయన నో చెప్పినా, అది బంపర్ హిట్ కావడమూ, ఇప్పుడు విన్నవారికి ఆశ్చర్యం కలిగించక మానదు. ‘హారీ పాటర్’ సిరీస్ లో మొదటి భాగం అయిన ‘ద ఫిలాసఫర్స్ స్టోన్’కు దర్శకత్వం వహించమని వార్నర్ బ్రదర్స్ సంస్థ స్పీల్ బెర్గ్ నే అడిగిందట. ఆ సినిమాను రూపొందించాలంటే యేడాది పడుతుందని, ఆ సమయంలో తాను తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని అనుకున్నానని అందుకే ‘నో’ చెప్పానని స్పీల్ బెర్గ్ చెప్పారు.

Dinesh karthik: అతడి బౌలింగ్ అంటే కోహ్లీ, రోహిత్‌కు చిరాకు: దినేశ్ కార్తీక్

అప్పటికే తాను డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించానని, అలాగే తన కుటుంబానికి సరిపడా ఆస్తులూ పోగేశానని స్పీల్ బెర్గ్ తెలిపారు. అందువల్ల ‘హారీ పాటర్’కు డైరెక్షన్ చేయడం వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదని భావించి, ‘నో’ అన్నాననీ ఆయన చెప్పారు. ఆ సమయంలో తన భార్య కేట్ క్యాప్షా, తాను కలసి పిల్లల భవిష్యత్ కు ప్రణాళికలు వేసుకుంటున్నామని, అలాగే ఆ సినిమా చేసినట్లయితే ఫ్యామిలీతో గడిపే మధురక్షణాలకు దూరం అయ్యేవాడిననీ అంటున్నారాయన. అలా చేసినందుకు తనకేమీ విచారం లేదని, పైగా ఆ సమయంలో అనుకున్న రీతితో తన భార్యాబిడ్డలతో గడిపినందుకు ఎంతో సంతోషిస్తున్నాననీ 73 ఏళ్ళ స్పీల్ బెర్గ్ వివరించారు.

Jagga Reddy: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండదు.. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్

ప్రపంచవ్యాప్తంగా పిల్లలను ఎంతగానో అలరించిన ‘హారీ పాటర్’ సిరీస్ కు తానూ అభిమానినేనని స్పీల్ బెర్గ్ అనడం కొసమెరుపు. ఆయన దర్శకత్వంలోనూ ఒకప్పుడు ‘ఇ.టి.- ఎక్స్ట్రా టెరస్ట్రియల్’ రూపొంది బాలలను ఎంతగానో అలరించిన విషయాన్ని మరచిపోరాదు.

Exit mobile version