Site icon NTV Telugu

Samantha Ruth Prabhu: సోషల్ మీడియాకు సమంత బ్రేక్.. ఆ పోస్టే కారణమా..?

Samantha

Samantha

Samantha Ruth Prabhu: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. సామ్ కు సినిమాలు అంటే ఎంత ఇష్టమో.. సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండడం అన్నా అంతే ఇష్టం. నిత్యం ఆమె తాను చేసే పనులను, సినిమా విశేషాలను, వ్యక్తిగత విషయాలను, అబిప్రాయాలను అన్నింటిని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఎంత బాధలో ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో రోజూ కనీసం రెండు పోస్ట్లు పెట్టకుండా ఉండదు. చివరికి చైతూ తో విడాకులు అయ్యి డిప్రెషన్ లో ఉన్నా కూడా ఆమె పలు కోట్స్ ను పోస్ట్ చేసి తన బాధను వ్యక్తపరిచింది. అలాంటిది ఏమైందో ఏమో తెలియదు కానీ గత 15 రోజుల నుంచి సమంత సోషల్ మీడియాలో మిస్ అయ్యింది.

జూన్ 30 నుంచి ఇప్పటివరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. అయితే ఇందుకు కారణాలు రెండు ఉన్నాయి అంటున్నారు అభిమానులు. ఒకటి ఆమె సోషల్ మీడియా హ్యాక్ అయ్యిందని..ఇటీవలే సామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మంత్రి కేటీఆర్ ఫోటో పోస్ట్ అయ్యింది. అరే సామ్ కు ఏమైంది.. సడెన్ గా పొలిటికల్ లీడర్ ఫోటోను షేర్ చేసింది ఏంటీ అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ తరువాత అది సామ్ పెట్టింది కాదని, ఒక టెక్నీకల్ గ్లిచ్ వలన వేరే గ్రూప్ లో షేర్ చేయాల్సిన ఫోటో సామ్ అకౌంట్ లోకి వచ్చిందని ఆమె డిజిటల్ మేనేజర్ చెప్పుకురావడంతో అభిమానులు శాంతించారు. ఈ సమస్య మీద వర్క్ చేస్తున్నాం అని, త్వరలోనే ఆ వ్యక్తులు ఎవరో కనిపెడతామని చెప్పుకొచ్చింది.

ఇక దీన్నీ వలనే సామ్ మౌనంగా ఉందని, తన అకౌంట్ ఇంకా సేఫ్ కాలేదని భావించి ఎలాంటి ఫోటోలు పెట్టడంలేదని అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం సామ్ షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఇన్స్టాగ్రామ్ కు దూరంగా ఉందని చెప్తున్నారు. ఇంకొందరు ఇటీవల సామ్ ను ట్రోల్ చేస్తుండడంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉందని అంటున్నారు. ఇక సామ్ అభిమానులు 15 రోజులుగా సామ్ మిస్సింగ్.. ఎక్కడున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే సామ్ నోరు విప్పక తప్పదు..

Exit mobile version