OG : డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి భారీ హైప్ తో వస్తున్న మూవీ ఓజీ. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. అసలు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారంట. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా అప్డేట్లు మాత్రమే ఇస్తారంట. పవన్ కల్యాణ్ నేరుగా వచ్చి ప్రమోషన్లు చేయొద్దని నిర్ణయించుకున్నారంట. ఎందుకంటే మూవీపై అంచనాలు హద్దులు దాటిపోతున్నాయి. ఇక పవన్ కల్యాణ్ బయటకు వచ్చి ప్రమోషన్లు చేస్తే.. ఫ్యాన్స్ బ్రహ్మాండం బద్దలైపోతుందన్నట్టు ఊహించుకుంటారు.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా..?
అప్పుడు సినిమా బాగున్నా వాళ్ల అంచనాలను అందుకోలేక ప్లాప్ టాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరిగింది. పవన్ స్వయంగా ప్రమోషన్లు చేయడంతో ఫ్యాన్స్ స్థాయికి మించి ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకున్నారు. అదే సినిమాను దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఓజీ విషయంలో ఇలాంటిది జరగొద్దని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారంట. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉండి కేవలం అప్డేట్లు మాత్రమే ఇస్తారంట. ఓజీకి కావాల్సినంత బజ్ ఎలాగూ ఉంది. కాబట్టి ఇక పవన్ బయటకు రావాల్సిన అవసరం ఏముంది. పైగా ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో హిట్ అయ్యే అవకాశం ఉన్న సినిమాకు తాను అంచనాలు పెంచి నష్టం చేయొద్దని అనుకుంటున్నారంట పవన్ కల్యాణ్. ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.
Read Also : Little Hearts : ప్రేక్షకులు నిజంగా పిచ్చోళ్లే.. మౌళి షాకింగ్ కామెంట్స్
