Martin Scorsese: గంటన్నర లోపు ప్రదర్శన కాలం ఉన్న సినిమాలతో కెరీర్ ఆరంభించిన ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కార్సెసే నిడివి పెంచుకుంటూ సాగారు. ఆయన తాజా చిత్రం ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ ప్రదర్శన సమయం 240 నిమిషాలు అంటే అక్షరాలా నాలుగు గంటలని ముందు ప్రకటించారు. ఈ సినిమాను మే 20న కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. దాంతో మార్టిన్ ను ఫ్యాన్స్ నిడివి ఎలాగైనా తగ్గించాలని, లేదంటే బాగున్న సినిమాకు కూడా బ్యాడ్ టాక్ వస్తుందని కోరారు. వారి అభిలాషను అర్థం చేసుకొని తాను ఎంతో ప్రేమగా తెరకెక్కించిన పలు సన్నివేశాలను కన్నీరు కారుస్తూ తొలగించారట మార్టిన్. అంతా చేసి ఆ సినిమాను 206 నిమిషాలకు కుదించారు. అంటే ఇప్పుడు ఆ చిత్రం ప్రదర్శనా సమయం 3 గంటల 26 నిమిషాలన్న మాట!
Cameras Expose Affair: కొంపముంచిన చలాన్.. భర్త ‘ఎఫైర్’ బట్టబయలు
మొదట్లో చిన్న చిత్రాలతోనే సాగిన మార్టిన్ 1977లో తాను తెరకెక్కించిన ‘న్యూ యార్క్, న్యూ యార్క్’ సినిమాను మొదటిసారి 163 నిమిషాలతో రూపొందించారు. ఆ పై 1988లో రూపొందించిన సెన్సేషనల్ మూవీ ‘ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్’ను కూడా 163 నిమిషాలతోనే తెరకెక్కించారు. 1995లో ‘క్యాసినో’ను 178 నిమిషాల పాటు సాగే సినిమాగా రూపొందించారు. 2002లో ‘గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’ను 167 నిమిషాలు నడిచే మూవీగా తీశారు మార్టిన్. వెంటనే 2004లో ‘ది ఏవియేటర్’ను 2 గంటల 50 నిమిషాల ప్రదర్శన సమయంతో రూపొందించారు. ఇలా రెండున్నర గంటల పై నిడివితో రూపొందిన చిత్రాలన్నీ మార్టిన్ కు సక్సెస్ అందించాయి. ఇక మార్టిన్ స్కార్సెసేకు బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ ను సంపాదించి పెట్టిన ‘ద డిపార్టెడ్’ మూవీ కూడా 2 గంటల 31 నిమిషాల ప్రదర్శనతో సాగింది. 2013లో మార్టిన్ తెరకెక్కించిన ‘ద వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ను సరిగా 3 గంటల సమయం సాగేలా తెరకెక్కించారు. ఈ సినిమా సైతం ఘనవిజయం సాధించింది.
HD Kumaraswamy: “కింగ్ మేకర్” కాదు.. “కింగ్”గా మారబోతున్నాం..
ఇదంతా బాగానే ఉంది. 2019లో మార్టిన్ స్కార్సెసే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఐరిష్ మేన్’ చిత్రం 209 నిమిషాల ప్రదర్శనతో తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాంబులా పేలింది. 160 మిలియన్ల పెట్టుబడితో రూపొందితే కనీసం పదోవంతు రాబడి చూడలేకపోయింది. మరి ఇప్పుడు వస్తున్న ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ కూడా 206 నిమిషాల ప్రదర్శన సమయం కలిగి ఉంది. పైగా 200 మిలియన్ డాలర్ల వ్యయంతో తెరకెక్కింది. మే 20న కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కానున్న ఈ సినిమా థియేటర్లలో అక్టోబర్ 6న వెలుగు చూడనుంది. ఇక్కడే మార్టిన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 80 ఏళ్ళ వయసులో మార్టిన్ రూపొందించిన ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలన్న ఆసక్తి హాలీవుడ్ సినీజనంలో రోజురోజుకూ పెరుగుతోంది. కాన్స్ లో ఈ సినిమా మంచి రివ్యూస్ సాధిస్తేనే, థియేటర్లలో కాసింత సందడిచేయగలదని సినీజనం అంటున్నారు.
