OTT Updates: యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించలేదు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్, అంజలి, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. సాధారణంగా ఇటీవల సినిమాలు 4 లేదా 5 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ విడుదలై 100 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు మాచర్ల నియోజకవర్గం మూవీ ఓటీటీలోకి రాలేదు. దీంతో కారణమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Adivi Sesh: మరో పెద్ద బ్యానర్‌లో అడివి శేష్ పాన్ ఇండియా సినిమా
ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం అక్టోబర్ తొలివారంలో అమెజాన్ ప్రైమ్‌లో మాచర్ల నియోజకవర్గం మూవీ స్ట్రీమింగ్ అవుతుందని పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రకటించినా అలా జరగలేదు. దాంతో దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఓటీటీ సంస్థలు కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించలేదని.. తక్కువ రేటుకు కోట్ చేశాయని తెలుస్తోంది. దీంతో ఓటీటీలకు తక్కువ రేటుకే ఈ మూవీని ఇచ్చేందుకు చిత్ర నిర్మాత ఇష్టపడలేదని ప్రచారం జరుగుతోంది.
Read Also: Vijay-Rashmika: విజయ్, రష్మిక పెళ్లి చేసుకున్నారా.. వెడ్డింగ్ ఫోటో వైరల్
మరోవైపు మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కూడా ఇప్పటివరకు ఓటీటీలో దర్శనం ఇవ్వలేదు. ఈ సినిమాతో పాటు విడుదలైన ఓరి దేవుడా, ప్రిన్స్ (నవంబర్ 24 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్) మూవీస్ కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ జిన్నా సినిమా గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే మాచర్ల నియోజకవర్గం మూవీ మాత్రం ఓటీటీలో రాకుండా నేరుగా టీవీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా టెలికాస్ట్ అయ్యేది తెలుగు టీవీ ఛానల్‌లో కాదులెండీ. మాచర్ల నియోజవకర్గం చిత్రాన్ని హిందీలో డబ్ చేసి సోనీ మాక్స్ టీవీ ఛానల్‌లో డిసెంబర్ 11న టెలికాస్ట్ చేస్తున్నట్లు సదరు ఛానల్ ప్రకటించింది.
