Site icon NTV Telugu

Manchu Lakshmi: ఎన్టీఆర్ సాధించిన దాన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవట్లేదు?

Manchu Lakshmi Tweet

Manchu Lakshmi Tweet

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెరైటీ మ్యాగజైన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ లో ఉన్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా, మీమ్ పేజస్, నందమూరి ఫాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కామన్ పబ్లిక్, మీడియా హౌజ్ లు ఎన్టీఆర్ గురించి ట్వీట్స్ చేస్తున్నారు కానీ ఇతర ఫిల్మ్ ఫెటర్నిటి సెలబ్రిటీస్ మాత్రం పెద్దగా స్పందించలేదు. కొందరు సెలబ్రిటీస్ ఎన్టీఆర్ ని కంగ్రాచ్యులేట్ చేస్తూ ట్వీట్స్ చేశారు కానీ అలా ట్వీట్స్ చేసిన వాళ్లలో స్టార్స్ ఎవరు లేరు. ఈ విషయాన్నే మంచు లక్ష్మి ప్రశించింది. ఎన్టీఆర్ సాధించిన చిన్న విషయం కాదు, వరల్డ్ సినిమాలో ఒక పెద్ద ఘనత. మనం ఎందుకు దాన్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు? అందరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని ప్రశ్నిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.

నిజంగానే ఎన్టీఆర్ ని అభినందిస్తూ ఒక్క స్టార్ హీరో, హీరోయిన్ కూడా ట్వీట్ చెయ్యలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, ఇప్పుడే ఏం ఉంది. ఒక్కసారి ఎన్టీఆర్ ఆస్కార్ ప్రాబబుల్స్ లోకి వెళ్ళినా, ఆస్కార్ ని ఇండియాకి తీసుకోని వచ్చినా అప్పుడు సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయో చూపిస్తాం అంటున్నారు. అయితే కొంతమందికి మాత్రం ఎన్టీఆర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ లో ఎలా ఉన్నాడు? అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కదా. ఒరిజినల్ గా అయితే తారక్ ఉన్నది 19వ స్థానంలో కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో రెండు కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ సాంగ్ కేటగిరీల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ గెలుచుకుంటుందని ఇండియన్ సినీ అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి జనవరి 10న జరగనున్న గోల్డెన్ గ్లోబ్ లో అవార్డ్స్ ఈవెంట్ లో ఇండియన్ సినిమా జెండాని ఆర్ ఆర్ ఆర్ ఎగరేస్తుందేమో చూడాలి.

Exit mobile version