NTV Telugu Site icon

Rajini Vs Chiru: స్టార్ హీరోల వార్ లో గెలిచేదెవరు?

Chiru Vs Rajini

Chiru Vs Rajini

ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కానుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ఈరోజు రిలీజ్ కానుంది. తమిళ వేదాలం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మెహర్ రమేష్ ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడో అనే భయం రెగ్యులర్ మూవీ లవర్స్ లో ఉంది కానీ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ని చూస్తే మాత్రం భోళా శంకర్ సినిమాపై పాజిటివ్  ఒపీనియన్స్ ఉన్నాయి. రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రమోషన్స్ చేస్తున్న ఈ సినిమాకి పోటీగా రజినీకాంత్ రేస్ లోకి వచ్చాడు. చిరు కన్నా ఒక్క రోజు ముందు ఆగస్టు 10న రజినీకాంత్ ‘జైలర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. జైలర్ ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ‘కావాలా’ సాంగ్ తో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఒక్క సాంగ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది జైలర్ సినిమా.

సెకండ్ సింగల్ రిలీజ్ కి కూడా మేకర్స్ రెడీ అవుతున్నారు. రిలీజ్ టైం టైం దగ్గర పడుతున్న కొద్దీ జైలర్ పై బజ్ పెరుగుతూనే ఉంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి నటిస్తున్నారు కాబట్టి తమిళ్ లో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో కూడా జైలర్ పై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. తెలుగులో మాత్రం ఆడియన్స్ చిరు సినిమాకే ఓటు వేసే అవకాశం ఉంది. తెలుగులో జైలర్ సినిమా థియేట్రికల్ రైట్స్ ని ఏషియన్ సొంతం చేసుకుంది కాబట్టి జైలర్ కి సాలిడ్ నంబర్స్ లో థియేటర్స్ దక్కడం గ్యారెంటీ. ఇంత భారీగా రిలీజ్ అవ్వనున్న జైలర్ కి భోళా శంకర్ సినిమాకి మధ్య ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉంది. సో రజిని సూపర్ హిట్ టాక్ రాబడితే థియేటర్స్ నిలబడతాయి లేదంటే రెండో రోజే చిరు మేనియాలో థియేటర్స్ అన్నీ ఎగిరిపోవడం ఖాయం.