NTV Telugu Site icon

ఒక ప్రేమకథ ముగిసింది! మరో ప్రేమకథ మొదలైంది!!

Who is this Jackky Bhagnani

మొత్తానికీ రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టిన రోజున ‘రహస్య స్నేహితుడు’ ఆచూకీ బయటపెట్టడంతో చిత్రసీమలో నయా లవ్ స్టోరీకి ఇవాళ అఫీషియల్ గా శ్రీకారం చుట్టినట్టు అయ్యింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించి పట్టుమని పది రోజులు కాకముందే, టాలీవుడ్ లో ఓ కొత్త ప్రేమ మొగ్గ తొడిగింది. ఈ రోజు ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ తన బోయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని పరిచయం చేసింది. ఆ తర్వాత కొద్ది సేపట్టికే అతను కూడా రకుల్ మీద తనకున్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశాడు. రకుల్ ప్రేమ వ్యవహారంతో అంత అవేర్ గా లేని చాలా మంది ఆమె ప్రకటనతో ఆశ్చర్యానికి లోనయ్యారు. జాకీ భగ్నానీ పేరును ఆమె వెల్లడించగానే అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Read Also : బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రకుల్… బర్త్ డే సర్ప్రైజ్ షాక్!!

ఎవరీ జాకీ భగ్నానీ!
హిందీ చిత్రసీమ గురించి అవగాహన ఉన్న వారికి జాకీ భగ్నానీ చిరపరిచితుడే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత వషు భగ్నానీ కుమారుడే జాకీ. పాతికేళ్ళుగా ఆయన తండ్రి చిత్ర నిర్మాణంలో ఉన్నాడు. దాంతో సహజంగానే జాకీ సైతం నిర్మాణ వ్యవహారాలతో తలమునకలయ్యాడు. అంతేకాదు.. 2009లో ‘కల్ కిస్నే దేఖా’ మూవీలో నటించాడు. ఆ తర్వాత ‘ఫాల్తూ, అజబ్ గజబ్ లవ్, రంగ్రేజ్, యంగిస్తాన్, వెల్ కమ్ 2 కరాచీ, మిత్రో’ తదితర చిత్రాలలో నటించాడు. తమిళంలో మూడేళ్ళ క్రితం త్రిషా సరసన ‘మోహిని’ అనే చిత్రంలోనూ చేశాడు. 36 సంవత్సరాల జాకీ నిర్మిస్తున్న ఓ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతోంది. అందులో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే… బాలీవుడ్ లో జాకీ భగ్నానీ మీద కూడా కొన్ని బ్లాక్ మార్క్స్ ఉన్నాయి. నాలుగు నెలల క్రితం ఓ మోడల్ జాకీ, అతని మిత్ర బృందం తనను మానభగం చేశారని, శారీరకంగా హింసకు గురిచేశారంటూ ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. 2014 నుండి 2019 మధ్యలో వారంతా తనను హింసించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే… ఇందులోని కొందరు ఆమె కావాలని తమని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈ ఆరోపణలను ఖండించారు. బాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత తనయుడితో రకుల్ కు ఉన్న ఈ సాన్నిహిత్యం కారణంగానే ఆమెను ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఎస్బీబీ అధికారులు విచారణ చేసి ఉండొచ్చనే వార్తలూ వస్తున్నాయి. మొత్తం మీద బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తనయుడితో రకుల్ సాగిస్తున్న ఈ ప్రేమాయాణం ఏ తీరాలకు చేరుతుందో వేచి చూడాలి.