NTV Telugu Site icon

బీచ్ లో కుర్రాడితో జాన్వీ… ఎవరబ్బా ?

Who Is The Man In Janhvi’s latest Beach Day Pics?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాహ్నవి కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో జాన్వీ షేర్ చేసిన హాట్ పిక్స్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరోసారి బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. సూర్యాస్తమయంలో బీచ్ లో పొట్టి బట్టలు ధరించి కన్పించింది జాన్వీ. ఈ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇందులో విశేషమేమంటే… ఈసారి జాన్వీ ఒక్కత్తే ఫొటోలో కన్పించలేదు. తనతో పాటు మరో కుర్రాడు కూడా ఉన్నాడు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read : సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్ ?

జాన్వీ, ఆ కుర్రాడు చేతిలో చెయ్యేసి మొహం కన్పించకుండా అటువైపుకు తిరిగి ఉన్న పిక్ పై అందరి దృష్టి పడింది. ఈ కుర్రాడు ఎవరై ఉంటాడనే ఆరాలు తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఆ పిక్ లో జాన్వి కపూర్‌తో ఉన్న వ్యక్తి ఓర్హాన్ అవత్రామణ. ఆమెకు సన్నిహితుడు… .అయితే నెటిజన్లు మాత్రం ఓర్హాన్, జాన్వీ మధ్య ప్రేమాయణం లాంటిది ఏమన్నా నడుస్తోందేమోననే డౌట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ‘రూహి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన జాన్వీ త్వరలో కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘గుడ్ లక్ జెర్రీ’తో పలకరించనుంది. అంతే కాదు ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దోస్తానా2’, ‘తక్త్’ సినిమాలలోనూ నటించబోతోంది.

Show comments