Site icon NTV Telugu

Samantha: సమంత పక్కన ఎవరతను.. ఫ్రెండా..? బాయ్ ఫ్రెండా..?

Sam

Sam

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజులుగా వెకేషన్ మోడ్ లోనే ఉంటుంది. మధ్యమధ్యలో షూటింగ్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఖుషీ, రెండు సిటాడెల్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తికావొచ్చింది. ఇంకోపక్క సిటాడెల్ సైతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్య మధ్య గ్యాప్ లో సామ్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు సామ్ కన్నా.. సామ్ పక్కన ఉన్న వ్యక్తి గురించే అభిమానులు చర్చించుకుంటున్నారు.. గత కొన్నిరోజులుగా సామ్ ఎక్కడ ఉంటే.. అతను కూడా అక్కడే ఉంటున్నాడు. అతను పేరు ఏంటి.. ? ఫ్రెండా.. బాయ్ ఫ్రెండా అనే విషయం ఎవరికి తెలియదు. సామ్ పుట్టినరోజున అతడే సర్ ప్రైజ్ ప్లాన్ చేసి.. సామ్ తో కేక్ కట్ చేయించాడు.

Yadama Raju: పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకముందే విడాకుల కోసం కొట్టుకున్న జబర్దస్త్ జంట

జిమ్ లో ఆమెతో వర్క్ అవుట్స్ చేయిస్తూ కనిపించాడు. సామ్ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవాళ్లందరిలో ఇతగాడే సామ్ తో మరింత చనువుగా కనిపిస్తుండడంతో ఎవరు ఇతను అనే అనుమానం వ్యక్తమవుతోంది. తాజాగా సామ్ వెకేషన్ ఫొటోస్ లో కూడా అతను కనిపించాడు. అయితే ఏ రోజు కూడా సామ్ అతడి గురించి మెన్షన్ చేయలేదు. ఎవరు అనేది కూడా చెప్పలేదు. దీంతో అభిమానుల్లో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరు బ్రో .. నువ్వు.. నిత్యం సామ్ చుట్టూనే తిరుగుతున్నావు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి సామ్ అయినా.. ఇతగాడిని పరిచయం చేస్తుందేమో చూడాలి.

Exit mobile version