Site icon NTV Telugu

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరు..?

Pawan

Pawan

Pawan Kalyan : థియేటర్ల బంద్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికే కుట్ర చేశారంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఆరోపణలు చేశారు. చివరకు నిర్మాతల మండలి చర్చలు జరిపి థియేటర్ల మూసివేత ఉండట్లేదని.. యథావిధిగా సినిమాలు ఆడుతాయంటూ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి ఈ ప్రకటన చేసిన కొద్ది క్షణాలకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సంచలన ప్రకటన చేశారు. సినిమా ఇండస్ట్రీ గౌరవ, మర్యాదలు కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. వాళ్లు మాత్రం తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also : Manchu Vishnu : వాడిని తీసుకోవడమే నేను చేసిన తప్పు.. మంచు విష్ణు కామెంట్స్..

వాళ్లు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ (థియేటర్ల మూసివేత)ను స్వీకరిస్తానని.. భవిష్యత్ లో వ్యక్తిగత సంప్రదింపులు ఉండవని.. ఆయా సంఘాల ప్రతినిధులే రావాలంటూ తేల్చి చెప్పేశారు. టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వం అంటే కనీస గౌరవ, మర్యాదలు లేకుండా పోయాయని సీరియస్ అయ్యారు. ఈ కామెంట్లే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్‌ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే చర్చ ఇప్పుడు మొదలైంది. నిర్మాతల మండలి మాత్రం ఒక సినిమాను ఆపేందుకు థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పడాన్ని ఖండించింది. కానీ పవన్ మాత్రం తన సినిమాను ఆపడానికే ఇలా చేశారని చెప్పకనే చెబుతున్నారు.

కొన్ని రోజులుగా టాలీవుడ్ కు చెందిన నలుగురు బడా నిర్మాతలు హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు వాటికి ఆజ్యం పోస్తున్నాయి. నిజంగానే వీరమల్లు సినిమాపై కుట్ర జరిగిందా.. పవన్ కల్యాణ్‌ మీద అంత కక్ష ఎవరికి ఉంటుంది అనే ఆరాలు మొదలయ్యాయి. పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆయనతో పెట్టుకునే ధైర్యం ఎవరైనా చేస్తారా.. అసలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరు అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. దానికి సమాధానం ఇప్పుడు పవన్ చెప్పకపోయినా.. భవిష్యత్ లో పవన్ తీసుకునే చర్యలను బట్టి తెలిసే ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు నెటిజన్లు.

Read Also : Pawan Kalyan: టార్గెట్ హరిహర .. డిప్యూటీ సీఎం ఆఫీస్ సంచలన ప్రకటన!

Exit mobile version