2024లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు వచ్చాయి. అవి కూడా టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలే. నాగ్ అశ్విన్ దర్శకత్వలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 2024కి ఫైనల్ టచ్ ఇస్తూ అల్లు అర్జున్ నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఏకంగా 1800 కోట్లు కొల్లగొట్టింది. కానీ 2025లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లు రాబట్టలేకపోయింది. ఇటీవల వచ్చిన కూలీ, వార్ 2 సినిమాల్లో ఏదో ఒకటి వెయ్యి కోట్ల క్లబ్‌లో ఎంటర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. కానీ రెండు సినిమాలు కలిపి వెయ్యి కోట్లు కూడా రాబట్టలేని పరిస్థితి ఉంది. కనీసం ఒక్కటి 500 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యే అవకాశాలు లేనట్టుగా ఉంది. మరి 2025లో వెయ్యి కోట్ల బొమ్మ ఏదైనా ఉందా? అంటే, రెండే రెండు సినిమాలు కనిపిస్తున్నాయి.
Also Read: SSMB 29: టైటిల్ కోసం రంగంలోకి అవతార్ డైరెక్టర్?
అందులో ఒకటి ప్రభాస్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ఉంది. డిసెంబర్‌లో రాజాసాబ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ పడితే వెయ్యి కోట్లు పక్కా అనే ట్రేడ్ లెక్కలు ఉన్నాయి. కానీ లేటెస్ట్‌గా ఈ సినిమా సంక్రాంతికి పోస్ట్‌పోన్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి.. తెలుగు నుంచి వెయ్యి కోట్ల రేసులో ఉన్న సినిమాలు లేవనే చెప్పాలి. కానీ కన్నడ నుంచి వస్తున్న కాంతార 2 మాత్రం వెయ్యి కోట్లు ఈజీగా కొల్లగొట్టేలా ఉంది. 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా.. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార మూవీ ఏకంగా 400 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. పైగా పాన్ ఇండియా లెవల్లో భారీ హైప్ ఉంది. కాబట్టి.. కొడితే ఈ సినిమానే వెయ్యి కోట్లు కొట్టాలి. లేదంటే.. 2025లో వెయ్యి కోట్ల సినిమా లేనట్టే!
