Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pluto OTT: సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే సాధారణంగా గుర్తొచ్చేది అద్భుతమైన శక్తులు ఉన్న ఏలియన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, భూమిపైకి వచ్చే గ్రహాంతరవాసులు, వాటి చుట్టూ జరిగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. కానీ మలయాళ సినిమా ‘ప్లూటో’ (Pluto)మాత్రం ఈ రొటీన్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఆలోచించింది. సూపర్ పవర్స్ లేని ఓ ఏలియన్.. పైగా భూమిపైకి వచ్చాక తాగుడుకు అలవాటు పడితే ఎలా ఉంటుంది? అదే కాన్సెప్ట్‌ను కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్‌తో కలిపి తెరకెక్కించిన ‘ప్లూటో’ ఇప్పుడు థియేటర్లను దాటి ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు కథేంటి? అనే వివరాలను తెలుసుకుందాం.
సైనా ప్లేలో స్ట్రీమింగ్
మలయాళ చిత్రసీమ ఇటీవలి కాలంలో తక్కువ బడ్జెట్‌తోనే విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అదే కోవలో వచ్చిన మరో ప్రయోగాత్మక చిత్రమే ‘ప్లూటో’. సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నీరజ్ మాధవ్, అల్తాఫ్ సలీం ప్రధాన పాత్రల్లో నటించారు. జూలై 30న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే సినిమాకు ఐఎండీబీలో 6.7 రేటింగ్ లభించడం విశేషం. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఆగస్టు 24 నుంచి సైనా ప్లే (Saina Play)లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సైనా ప్లేలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో కలిసి ఎలాంటి అశ్లీలత లేకుండా సరదాగా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఆప్షన్‌గా నిలవొచ్చని అంటున్నారు. ముఖ్యంగా రొటీన్ సైన్స్ ఫిక్షన్ కథలకు భిన్నంగా, సూపర్ పవర్స్ లేని ఏలియన్‌ను చూడాలనుకునే వారికి ఈ సినిమా ఆసక్తికరంగా అనిపించవచ్చు.
Also Read
కథ విషయానికి వస్తే
జీవితంలో వ్యాపారాలు దెబ్బతిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విక్కీ (నీరజ్ మాధవ్) కి ఒకరోజు అనుకోకుండా తన ప్రాంతంలో ల్యాండ్ అయిన ఒక వింత ఏలియన్‌ను ఎదురుపడుతుంది. అయితే దానికి ఎలాంటి పవర్స్ ఉండవు. దానికి ‘ప్లూటో’ అని పేరు పెట్టి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా తన ఇంట్లో దాస్తాడు. ఇక అక్కడి నుంచి గందరగోళం మొదలవుతుంది. ఆ గ్రహాంతరవాసికి భూమిపై ఉన్న ఆహార పదార్థాలేవీ పడవు సరే కదా, కనీసం నీళ్లు తాగినా అది నీరసించిపోతూ ఉంటుంది. ఈ గందరగోళంలో ఉన్న విక్కీకి ఒకరోజు ఊహించని నిజం తెలుస్తుంది. ప్లూటోకు మద్యాన్నే తాగించాలి. ఎందుకంటే, అది ఉండే గ్రహంపై నివసించే ప్రాణులకు మద్యాన్నే ఎనర్జీ సోర్స్ గా వాడుకుంటారు.
ఇక విక్కీ ప్రతిరోజూ దొంగతనంగా మద్యాన్ని తెచ్చి ఏలియన్‌కు ఇస్తూ దానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తుంటాడు. మద్యం తాగిన ప్రతిసారీ ఆ ఏలియన్ చేసే వింత వింత పనులు, విక్కీ అతని స్నేహితుడు జోస్ మధ్య జరిగే సిట్యుయేషనల్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. కానీ ఈ ఏలియన్ తాగుడు అలవాటు వల్ల స్థానిక విలన్ (అజు వర్గీస్) కి దీని ఉనికి గురించి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆ విలన్ నుండి తన తాగుబోతు ఏలియన్ స్నేహితుడిని కాపాడి, దాన్ని సురక్షితంగా స్పేస్‌షిప్ ఎక్కించి సొంత గ్రహానికి విక్కీ ఎలా పంపాడు అనేదే మిగతా కథ.
- Tags
- cinema
- Saina Play
తాజావార్తలు
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!