RRR: ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. కథ, కథనం, నటీనటులతో పాటు నిర్మాత ఎంతో ముఖ్యం. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది కేవలం ఆ బడ్జెట్ ను బట్టే ఉంటుంది. సినిమా సక్సెస్ విషయంలో డైరెక్టర్ ఎంత శ్రద్ద వహిస్తాడో నిర్మాత కూడా అంతే శ్రద్ద తీసుకుంటాడు. భారీ భారీ సెట్టింగ్స్, లొకేషన్స్, సినిమాకు అయ్యే ఖర్చుతో పాటు ప్రమోషన్స్ కూడా నిర్మాతనే భరించాలి. సినిమాలకు అవార్డులు వచ్చినా.. ప్రశంసలు వచ్చినా అందులో సగం నిర్మాతకకే దక్కుతాయి అన్నది నమ్మదగ్గ నిజం. అయితే ఒక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు తిరగరాసి.. హాలీవుడ్ లో సైతం తెలుగువాడి సత్తా చూపించిన సినిమా.. ఇక ఈ సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది. అందరూ.. డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు చరణ్, తారక్ ను మాత్రమే ప్రశంసిస్తున్నారు. ఏ ఈవెంట్స్ లోనైనా వీరే కనిపిస్తున్నారు. మరి అంత బడ్జెట్ పెట్టిన దానయ్య ఎక్కడ..? సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన ప్రమోషన్స్ లో కనిపించిన దానయ్య .. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ కు సంబందించిన ఏ ఒక్క అవార్డు ఈవెంట్ లో కనిపించలేదు.
Samantha Ruth Prabhu Injured Live: వెబ్ సిరీస్ షూటింగ్.. సమంతకు గాయాలు
రేపో మాపో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోబోతుంది. చిత్ర బృందం మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది.. ప్రమోషన్స్ చేస్తోంది.. కానీ, దానయ్య మాత్రం మీడియా ముందు కాదు కదా కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేడు. అసలేమైంది. చిత్ర బృందం సైతం దానయ్య ను ఎందుకు దూరం పెడుతోంది అనేది అంతుచిక్కని ప్రశ్న. అయితే.. రాజమౌళి తాన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను జపాన్ లో రిలీజ్ చేయడానికి, ఆస్కార్ నామినేషన్స్ కు కావాల్సిన రూ. 50 కోట్ల డబ్బును దానయ్య ఇవ్వలేదట.. అవన్నీ కూడా రాజమౌళినే దగ్గర ఉండి చూసుకున్నాడట.. అందుకే దానయ్య పేరును ఎక్కడా ప్రస్తావించడం లేదని చెప్పుకొస్తున్నారు. అయితే.. సినిమాకు ఖర్చుపెట్టింది ఆయనే కాబట్టి కనీసం నిర్మాతగా అయినా ఆయనపేరు వాడొచ్చు కదా అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇదేకాకుండా ప్రస్తుతం దానయ్య వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం వలన వీటిని పట్టించుకోలేదని కొందరు.. నిర్మాతగా తన డబ్బు వచ్చేసింది.. ఇంకా ఇలాంటివాటితో ఆయనేకేం సంబంధం అని ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయమై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.