Karthi: తమిళనాట ఓకే.. కార్తీకి తెలుగులో పూర్వవైభవమెప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi: కార్తికి తమిళనాటనే కాదు తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఉంది. ఆరంభంలో వరుస హిట్స్ ఇచ్చిన కార్తి ఆ తర్వాత ఎక్కువగా పరాజయాలను ఎదుక్కొన్నాడు. మధ్యలో ‘ఖాకీ’, ‘ఖైదీ’ వంటి హిట్ సినిమాలు వచ్చినా ఎందుకో కార్తీ మార్కెట్ బాగా డౌన్ అయింది. ఇక ఈ ఏడాది కార్తీ నటించిన ‘విరుమాన్’, ‘పొన్నియన్ సెల్వన్ 1’, ‘సర్దార్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. నిజానికి తమిళ నాట కార్తీ ఈ సినిమాలతో మంచి పేరే తెచ్చుకున్నాడు. ‘విరుమాన్’ దాదాపు 50 కోట్ల వరకూ వసూలు చేసింది.
‘సర్దార్’ వంద కోట్ల క్లబ్ లో ఎంటర్ అయినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్ 1’ అయితే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలేవి తెలుగులో అంతగా ఆడలేదు. ఏదో వచ్చాయి వెళ్ళాయి అంతే. తమిళనాట తమ హీరోకి 2022 బాగా కలసి వచ్చిందని కార్తీ అభిమానులు సంబర పడుతున్నారు. ఈ మూడు సినిమాలే కాకుండా కమల్ ‘విక్రమ్’ సినిమాకు తమిళంలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు కార్తీ. ఆ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘సర్దార్’కి సీక్వెల్ గా ‘సర్దార్ 2’ చేయబోతున్నాడు కార్తీ. ‘పొన్నియన్ సెల్వన్ 2’ రిలీజ్ కావలసి ఉంది. ఇంకా కొత్త కమిట్ మెంట్స్ ను ప్రకటించలేదు. ఈ ఏడాది తమిళంలో తన కెరీర్ బాగున్నా.. తెలుగులో మాత్రం నిరాశాజనకంగానే సాగింది. మరి రాబోయే సినిమాలైనా బాగా ఆడి కార్తీకి తెలుగునాట పూర్వవైభవాన్ని తెచ్చిపెడతాయేమో చూడాలి.
Also Read
- SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
- Kajal Aggarwal: "అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు".. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
- Sumanth: 'నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..' అంత మాట అనేశాడేంటి?
- NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
తాజావార్తలు
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
India New Jersey: భారత జట్టుకు కొత్త లుక్.. బ్లూ జెర్సీకి గుడ్‌బై.. కాషాయపు జెర్సీతో వరల్డ్‌కప్ బరిలోకి.!
-
Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
-
Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్‌పై నిషేధం.. కారణమిదే!
-
Shubman Gill: గిల్ ‘మాస్టర్ ప్లాన్’కి ఓకే చెప్పిన బీసీసీఐ.. శ్రీలంక సిరీస్‌కు ముందే అనూహ్య నిర్ణయం..
ట్రెండింగ్
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!