మాస్ మహారాజ రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో రవితేజహాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ మాస్ మహారాజా ఫాన్స్ సందడి చేస్తున్నారు. రవితేజ తన కెరీర్ మొత్తంలోనే ఇప్పుడు పీక్ ఫేజ్ లో ఉన్నాడు. ధమాకా సినిమాతో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని టచ్ చేసిన రవితేజ, లేటెస్ట్ గా చిరుతో కలిసి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు చేసిన రవితేజ, ముందెన్నడూ లేనంత జోష్ లో కనిపిస్తున్నాడు. ధమాకా సినిమాలో కామెడీ చేసిన రవితేజ, వాల్తేరు వీరయ్య సినిమాలో ఎమోషన్ పండించాడు. తనకి సరైన క్యారెక్టర్ పడాలే కానీ ఎలాంటి ఎమోషన్ ని అయినా ప్రెజెంట్ చెయ్యగలను అని మరోసారి ప్రూవ్ చేసిన రవితేజ, ఇప్పుడు ‘రావణాసుర’ అనే సినిమా చేస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి జనవరి 26న అప్డేట్ వస్తుందేమో అని రవితేజ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
సుధీర్ వర్మ సినిమా అనగానే ఇంటెన్స్ డ్రామాలు గుర్తొస్తాయి మరి ఈసారి రవితేజని సుధీర్ వర్మ ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఆ క్యూరియాసిటీ మరింత పెరిగి, సినిమాపై అంచనాలు పెంచడానికి ఉపయోగ పడాలి అంటే రావణాసుర టీమ్ నుంచి జనవరి 26న ఏదైనా సాలిడ్ అప్డేట్ రావాలి. ప్రస్తుతం రవితేజపై ఉన్న పాజిటివిటిని కాష్ చేసుకోగలిగితే అది రావణాసుర ప్రమోషన్స్ చాలా హెల్ప్ అవుతుంది. మరి సుధీర్ వర్మ ఆ సైడ్ అలోచించి రావణాసుర ప్రమోషన్స్ ని జనవరి 26 నుంచే మొదలుపెడతాడా? లేక సెప్టెంబర్ నెలలో కదా రిలీజ్ ఇప్పుడే ఫస్ట్ లుక్ ఎందుకులే అని సైలెంట్ గా ఉంటాడా అనేది తెలియాలి అంటే జనవరి 26 వరకూ ఆగాల్సిందే.