టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ అనుకున్న అంచనాలను అందుకుంది. తొలి ఆట నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ డే కి ధీటుగా రెండో రోజు కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ అఫీషియల్ గా వసూళ్ల వివరాలు అందించారు.
Also Read:Empuraan: ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ నుండి మరో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల..
గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లుగా చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు దగ్గర దగ్గర రూ. 20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం రెండు రోజులు కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా రూ.41.20 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం.
ఇక రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటంతో వీకెండ్ లో జనాలు ఈ సినిమా హాళ్లకు బాట పడుతున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో అడ్వాన్స్ బుకింగ్ సెకండ్ డే కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. దీంతో మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా రెండు రోజుల్లోనే ‘తండేల్’ రూ.41 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే ఇది నాగచైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని చెప్పాలి.