18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజెస్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ కథను అందించాడు. ఇక గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ఆహా ఓటిటీలో ప్రత్యేక్షమయ్యింది. ఇక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఫోన, సోషల్ మీడియాకు దూరంగా ఉండే అమ్మాయి.. ఫోనే ప్రపంచంగా బతికే అబ్బాయి మధ్య జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ కచ్చితంగా వస్తోంది.
Amigos: ఆహా.. రొమాన్స్ లో బాబాయ్ ను మించిపోయిన అబ్బాయ్
అనుపమ పరమేశ్వరన్ ముంత మసాలా తినేటప్పుడు బ్యాగ్ లో నుంచి ఒక పొట్లాన్ని తీసి అందులో ఉన్న పొడిని ముంత మసాలా మీద చల్లి.. అటుఇటు తిప్పి తింటుంది. ఇక అది తిన్న ముంత మసాలా తయారుచేసే అబ్బాయి కూడా సూపర్ అక్కా అంటూ చెప్పుకొస్తాడు. ఇక అదే విధంగా నిఖిల్ కూడా ఆ ముంత మసాలా తినిన ప్రతి సారి ఆ పొడి కలుపుతాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. అసలు ఆ పొడి ఏంటి అనేది మాత్రం సినిమాలో చూపించలేదు. దీంతో సినిమా చూసిన వారికి ఆ పొడి ఏంటి..? అనేది అనుమానం రాకమానదు. ఇక సోషల్ మీడియాలో అభిమానులు అయ్యా..ఆ ముంత మసాలాలో కలిపిన పొడిపేరు చెప్పండయ్యా అంటూ మీమ్స్ వేసేస్తున్నారు. ఒక అభిమాని అయితే ట్విట్టర్ లో ఈ అనుమానాన్ని నిఖిల్ ను అడిగేశాడు. అందుకు నిఖిల్ నవ్వుతూ.. ఆ పొడికి సంబంధించిన సీక్రెట్ ను డిలేటెడ్ సీన్ గా రిలీజ్ చేస్తామని చెప్పాడు. దీంతో అదేదో త్వరగా రిలీజ్ చేయండి.. అసలు ఆ పొడి ఏంటో తెలుసుకోలేకపోతే నిద్ర పట్టేలా లేదు అంటూ చెప్పుకొస్తున్నారు.
Nabha Natesh: ఏం మధువు దాగుందో ఈ మగువలో చూస్తేనే కిక్కేకేలా..
