Site icon NTV Telugu

NBK With Prabhas: ప్రభాస్ ను ఆ డ్రెస్ లు వేసుకోమని ఎవడు చెప్పాడో అడుగు బాలయ్య

Prabhas

Prabhas

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోతో తనలో ఉన్న హోస్ట్ ను బయటపెట్టాడు. అబ్బా బాలకృష్ణ హోస్ట్ ఏంటి..? అన్నవారు ముక్కు మీద వేలేసుకునేలా సీజన్ 1 ను విజయవంతం చేశాడు. ఇక ఆయన వాక్చాతుర్యం ముందు స్టార్ హీరోలు సైతం సైలెంట్ అయిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక సీజన్ 2 లో ఒక అద్భుతం జరగనుంది. ఎప్పుడు ఏ టాక్ షోకు రాని ప్రభాస్ ను ఈ షోకు ఆహ్వానించాడు బాలయ్య. ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తున్న వేళ నేడు ఆహా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో బాహుబలి.. అభిమానులు బాలయ్య.. బాహుబలిని ఏ ప్రశ్న అడగమంటారు.. ఒకటి చెప్పండి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఏకరువు పెట్టేశారు.

ఇక అందులో అందరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే.. ఆ లూజ్ డ్రెస్ లు, రుమాలు కట్టుకోమని ఎవరు చెప్పారు.. పెళ్లి ఎప్పుడు..? కృతి ఇష్టమా.. అనుష్క ఇష్టమా..?.. ఫిట్ నెస్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తావ్.. ఎందుకు ఎప్పుడు బ్లాక్ డ్రెస్ మాత్రమే వేసుకుంటావ్.. ? బోయపాటి తో సినిమా ఎప్పుడు చేస్తావ్..? నీ పెళ్లి కోసం ఎన్నిరోజులు ఎదురుచూడాలి.. ఎవరితో ప్రేమలో ఉన్నావ్..? ఇలా రకరకాల ప్రశ్నలు వేయమని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రశ్నలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలే ప్రభాస్ మొహమాటస్తుడు.. ఇక బాలయ్య అనర్గళంగా మాట్లాడగల వక్త.. వీరిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.

Exit mobile version