NTV Telugu Site icon

Anil sunkara: ఖరీదైన తప్పులు చేశా.. ఇక ఓపిక లేదంటున్న అనిల్ సుంకర

Anil Sunkara

Anil Sunkara

We made costly mistakes says Anil Sunkara: నిర్మాత అనిల్ సుంకర ఈ మధ్య వరుస సినిమాలతో ఇబ్బందులు పడ్డారు. ముందుగా ఏజెంట్, ఆ తర్వాత భోళా శంకర్ సినిమాలు చేయగా ఆ రెండు సినిమాలు దారుణమైన విధంగా నష్టాలు తెచ్చాయి. ఇక ఈ విషయాల గురించి స్పందిస్తూ తాను అలాగే తన టీమ్ కొన్ని ఖరీదైన తప్పులు చేశామని అనిల్ సుంకర ఒప్పుకున్నారు. అనిల్ సుంకర ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాల దెబ్బకు దాదాపు 80 కోట్లు నష్టపోయారు. అఖిల్ అక్కినేని నటించిన “ఏజెంట్”, మెగాస్టార్ చిరంజీవి నటించిన “భోలా శంకర్” సినిమాలు ఆయనకు భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ఇక ఏజెంట్ సినిమా విషయంలో అయితే ఏకంగా ఓటీటీ లోకి రావాల్సి ఉండి కూడా స్టే కారణంగా వాయిదా పడింది. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆయన నిర్మాణ సంస్థ ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా “ఊరు పేరు భైరవ కోన” అనే కొత్త సినిమాను నిర్మిస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు.

Indraja: హీరోయిన్ గా ఇంద్రజ.. ఈ వయసులో కూడా తగ్గకుండా!

ఇంకా రిలీజ్ డేట్ మీద కూడా క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా ఆగిపోయిందా? ఏంటి అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ సినిమా గురించి అనిల్ సుంకర స్పందించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూర్తిగా వీఎఫ్‌ఎక్స్ మీద ఆధారపడి నిర్మిస్తుండగా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ పూర్తయి అది సంతృప్తి చెందే వరకు విడుదల తేదీని ప్రకటించనని దర్శకుడు ఇప్పటికే పేర్కొన్నాడు. ఊరుపేరు భైరవకోన #విరూపాక్షను పోలి ఉండదు అని స్పష్టం చేయడం నా బాధ్యత అని నేను నమ్ముతున్నానని, ఇలాంటి జానర్‌లు అంటే ఒకటే కథ అని అనుకోకూడదని అన్నారు. అంతేకాక వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ పూర్తయి అది సంతృప్తి చెందే వరకు విడుదల తేదీని ప్రకటించనని ఆయన చెప్పుకొచ్చారు. వీఐ ఆనంద్ పోస్ట్‌కు ప్రతిస్పందనగా అనిల్ సుంకర ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. VFX నాణ్యత ఎల్లప్పుడూ సాంకేతిక నిపుణులకు ఇచ్చిన సమయాన్ని బట్టే ఉంటుందని, ఇప్పటికే “మేము కొన్ని ఖరీదైన తప్పులు చేసాము, ఇకపై పునరావృతం కాకుండా ప్రయత్నిస్తున్నాము,” అని ఆయన రాసుకొచ్చారు. అంతేకాదు ఊరు పేరు భైరవకోన లాంటి సినిమా కోసం వీఎఫ్ఎక్స్ పూర్తయిన తరువాత మాత్రమే తేదీని ప్రకటించాలనుకుంటున్నాం, ఈ సినిమా అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ఉందని పేర్కొన్న ఆయన సెకండ్ సింగిల్ ని త్వరలో ప్రకటిస్తారని అన్నారు.