Akhanda2Thaandavam : అఖండ 2 రిలీజ్ వాయిదా వేసినందుకు మమ్మల్ని క్షమించండి : 14 రీల్స్ ప్లస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. గత రాత్రి 9. ౩౦ గంటల ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. కానీ సినిమా రిలీజ్ కు గంట ముందు అభిమానులకు షాక్ ఇస్తూ రిలీజ్ వాయిదా వేశారు.
ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేస్తూ ‘అనివార్య పరిస్థితుల కారణంగా అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని మీకు తెలియజేయడానికి బరువెక్కిన హృదయంతో చింతిస్తున్నాము. ఇది మాకు చాలా బాధాకరమైన క్షణం. అఖండ 2 కోసం ఎదురుచూస్తున్ననందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు కలిగించే ఆవేదనను మేము అర్థం చేసుకోగలము. రిలీజ్ వాయిదా కు సంబంధించిన అన్ని అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో అన్ని పనులను చక్కబెట్టి రిలీజ్ చేస్తామని మేము హామీ ఇస్తున్నాము’ అని అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్. మరోవైపు అఖండ 2 ప్రిమియర్స్ తో పాటు రిలీడ్ డే రోజు అనగా ఈ రోజు షోస్ కు సంబంధించి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు ఫ్యాన్స్. ఆ టికెట్స్ కూడా థియేటర్స్ వద్ద తిరిగి చెల్లించి డబ్బులు వాపస్ తీసుకోవాలని తెలిపాయి థియేటర్ యాజమాన్యాలు. అసలు ఈ సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎప్పుడు అఖండ 2 రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు.
Also Read
With a heavy heart, we regret to inform you that #Akhanda2 will not be releasing as scheduled due to unavoidable circumstances.
This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film.
We are working…
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?