Site icon NTV Telugu

Akhanda2Thaandavam : అఖండ 2 రిలీజ్ వాయిదా వేసినందుకు మమ్మల్ని క్షమించండి : 14 రీల్స్ ప్లస్

Akhanda 2

Akhanda 2

నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. గత రాత్రి 9. ౩౦ గంటల ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. కానీ సినిమా రిలీజ్ కు గంట ముందు అభిమానులకు షాక్ ఇస్తూ రిలీజ్ వాయిదా వేశారు.

ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేస్తూ ‘అనివార్య పరిస్థితుల కారణంగా అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని మీకు తెలియజేయడానికి బరువెక్కిన హృదయంతో చింతిస్తున్నాము. ఇది మాకు చాలా బాధాకరమైన క్షణం. అఖండ 2 కోసం ఎదురుచూస్తున్ననందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు కలిగించే ఆవేదనను మేము అర్థం చేసుకోగలము. రిలీజ్ వాయిదా కు సంబంధించిన అన్ని అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. మీ మద్దతు మాకు చాలా అవసరం.  అతి త్వరలో అన్ని పనులను చక్కబెట్టి రిలీజ్ చేస్తామని మేము హామీ ఇస్తున్నాము’ అని అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్. మరోవైపు అఖండ 2 ప్రిమియర్స్ తో పాటు రిలీడ్ డే రోజు అనగా ఈ రోజు షోస్ కు సంబంధించి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు ఫ్యాన్స్. ఆ టికెట్స్ కూడా థియేటర్స్ వద్ద తిరిగి చెల్లించి డబ్బులు వాపస్ తీసుకోవాలని తెలిపాయి థియేటర్ యాజమాన్యాలు. అసలు ఈ సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎప్పుడు అఖండ 2 రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు.

Exit mobile version