పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ తో సూపర్ హిట్ కొట్టారు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ అఖండకు అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు.
Also Read : Neha Sharma : ఆహా.. నేహా.. ఆ కళ్ళు.. ఆ హొయలు.. వాహ్ వా..
అయితే వీర సింహారెడ్డి కాకుండా బాలయ్యతో గోపిచంద్ వేరే కథతో సినిమా చేయాల్సి ఉందట. అదే సన్నీ డియోల్ హీరోగా తాజాగా బాలీవుడ్ లో వచ్చిన జాట్. క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్యను కలిసి జాట్ స్టోరీ వినిపించాడట. ఆ సినిమా చేసేందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. కానీ ఈ గ్యాప్ లో అఖండ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అవడంతో బాలయ్య నెక్ట్స్ సినిమాపై అంచనాలు భారీ గా పెరిగాయి. దింతో జాట్ కథను పక్కన పెట్టి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో కథ రెడీ చేయమని చెప్పడంతో వీరసింహ రెడ్డి కథ వినిపించడం అందుకు బాలయ్య ఒకే చేయడం చక చక రిలీజ్ కావండ జరిగాయి. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా వెల్లడించారు. అలా బాలయ్య పక్కన పెట్టిన ఓ కథ అటు ఇటు తిరిగి బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ వద్దకు చేరి హిట్ గా నిలిచింది.
