Deepavali Cinemas: టాలీవుడ్‌లో కోలీవుడ్ చిత్రాల మధ్యే వార్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepavali Cinemas: ఈ ఏడాది దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల చివరి వారంలో తమిళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి. ధనుష్ నటించగా, సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ‘నేనే వస్తున్నా’ సెప్టెంబర్ 29న విడుదలైతే, ఆ మర్నాడే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ రిలీజైంది. దాదాపు ఇలాంటి పరిస్థితే ఈ నెల మూడోవారంలో దీపావళి కానుకగా విడుదల కాబోతున్న సినిమాల విషయంలోనూ జరుగబోతోంది.
‘సర్దార్’ వర్సెస్ ‘ప్రిన్స్’
తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. ‘అభిమన్యుడు’ ఫేమ్ పి. ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రాశిఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 21న విడుదల అవుతోంది. దీన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే రోజున మరో తమిళ సినిమా ‘ప్రిన్స్’ కూడా రిలీజ్ అవుతోంది. శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ‘ప్రిన్స్’ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె. వి. తెరకెక్కించాడు. విశేషం ఏమంటే.. నాగార్జునతో ఇటీవల ‘ది ఘోస్ట్’ మూవీ నిర్మించిన సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ తో పాటు సురేశ్ బాబు దీన్ని నిర్మించాడు.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
మరో చిత్రం ఏంటంటే.. ఈ రెండు సినిమాలతో పాటు మరో తమిళ రీమేక్ మూవీ కూడా తెలుగువారి ముందుకు 21వ తేదీనే వస్తోంది. ‘ఓ మై కడవులే’ అనే తమిళ సినిమాను తెలుగులో విశ్వక్ సేన్‌తో ‘ఓరి దేవుడా’ పేరుతో ప్రసాద్ వి పొట్లూరి, ‘దిల్’ రాజు సంయుక్తంగా నిర్మించారు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ కీలకమైన దేవుడి పాత్రను పోషించారు. మాతృకకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తునే తెలుగు రీమేక్ కూ డైరెక్షన్ చేశారు. సో… ఆ రకంగా ఈ మూడు తమిళ కంటెంట్ మూవీస్ తెలుగులో దీపావళికి జనం ముందుకు వస్తున్నాయి. దీంతో పాటే అదే రోజున మంచు విష్ణు నటించి, నిర్మించిన ‘జిన్నా’ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లోనూ, హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ఆడమ్’ డబ్బింగ్ వర్షన్ విడుదల కాబోతున్నాయి. ఇక 25వ తేదీ దీపావళి పండగ రోజున అక్షయ్ కుమార్ హిందీ చిత్రం ‘రామ్ సేతు’ తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ అవుతోంది. ఇందులో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. ఆ రకంగా ఇది కూడా తెలుగు వారిలో ఆసక్తిని రేకెత్తించే ప్రాజెక్టే. మరి వీటిల్లో ఏ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారో చూడాలి.

తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!