WAR 2 Trailer Review : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ వార్-2. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ను నింపేశారు. ‘నేను అన్నీ వదిలేసి నీడలా మారిపోతాను. కంటికి కనిపించని త్యాగాలను చేస్తాను. చివరకు ప్రేమను కూడా వదిలేస్తాను’ అంటూ హృతిక్ రోషన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ‘నేను మాటిస్తున్నాను. ఎవ్వరూ చేయలేని పనులను నేను చేస్తాను. ఎవ్వరూ చేయని యుద్ధాన్ని నేను చేస్తాను’ అంటూ ఎన్టీఆర్ నుంచి పవర్ ఫుల్ డైలాగ్ వస్తుంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ ను సముద్రంలో ఎన్టీఆర్ వెంబడించే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. విజువల్ ఫీస్ట్ లా ఆ సీన్స్ ను అయాన్ ముఖర్జీ తీశాడని ట్రైలర్ లో కనిపిస్తోంది.
Read Also : WAR 2 Trailer : వార్-2 ట్రైలర్ వచ్చేసింది..
గాల్లోని ఫ్లైట్ మీద ఎన్టీఆర్ చేసే యాక్షన్ సీన్స్ గొప్పగా ఉన్నాయి. ఎక్కడా వీఎఫ్ ఎక్స్ తేలిపోకుండా జాగ్రత్త పడ్డారని చూస్తేనే అర్థం అవుతుంది. అయితే ఇందులో ఇద్దరి పాత్రలకు సమన్యాయం చేసినట్టు కనిపించింది. హృతిక్ రోషన్ కు ఎన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయో ఎన్టీఆర్ కు కూడా అన్నే యాక్షన్ సీన్లు పెట్టేశారు. ఇద్దరు వేర్వేరుగా ఫైట్ చేసే యాక్షన్ సీన్ల కంటే.. వీరిద్దరు ఒకే చోట ఫైట్ చేసే సీన్లనే ఎక్కువగా ట్రైలర్ లో పెట్టారు. ఒక రకంగా వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్లే హైలెట్ కాబోతున్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. మీరిద్దరు సోల్జర్స్. ఇది వార్ అంటూ ప్రముఖ నటుడు అశుతోష్ రానా చెప్పే డైలాగ్ తర్వాత ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ కనిపిస్తుంది. ఇద్దరూ ఫైట్ చేసే ఈ సీన్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. హృతిక్ రోషన్, కియారా రొమాన్స్ కూడా ఇందులో హైలెట్ కాబోతోంది. అయితే హృతిక్, కియారా ఫైట్ చేసుకోవడం ఇక్కడ ఇంకో ట్విస్ట్. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీలో ట్విస్టులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ లో చూపించనివి థియేటర్ లో చాలా చూపిస్తారని తెలుస్తోంది. మొత్తంగా వార్-2 యాక్షన్ ఫీస్ట్ కావడం ఖాయం.
Read Also : HHVM : బాయ్ కాట్ ట్రెండ్.. వీరమల్లుకు కలిసొచ్చిందే..
