Site icon NTV Telugu

War 2 Event : విజయవాడలో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. క్లారిటీ..

War 2

War 2

War 2 Event : జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈవెంట్ ను విజయవాడలో నిర్వహిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో పాటు మూవీ టీమ్ హాజరవుతారని.. టాలీవుడ్ స్టార్ హీరో కూడా వస్తారంటూ ఓ రూమర్ వైరల్ అవుతోంది. దానిపై తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవన్నీ అపోహలే అంటూ తెలిపింది.

Read Also : HHVM : వీరమల్లును కామెడీ మూవీగా తీయాలనుకున్నాం.. జ్యోతికృష్ణ కామెంట్స్

ఇప్పటి వరకు ఎలాంటి ఈవెంట్ కన్ఫర్మ్ కాలేదని.. మూవీ పనులు అన్నీ కంప్లీట్ అయ్యాక క్లారిటీ ఇస్తామని చెప్పింది. ఈవెంట్స్ గురించి తామే అఫీషియల్ గా క్లారిటీ ఇస్తామని.. అప్పటి వరకు ఫ్యాన్స్ ఎవరూ రూమర్లను నమ్మొద్దంటూ కోరింది. ఎన్టీఆర్ ను వార్-2లో చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. టీజర్ కంటే ట్రైలర్ లో ఆయనకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇచ్చారు. ఇప్పటి వరకు చూడని విధంగా ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ గురించే ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. రజినీకాంత్ కూలీ మూవీతో ఈ మూవీ పోటీపడబోతోంది. సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోల మూవీల్లో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.

Read Also : HHVM : పురాణాల ఆధారంగా పవన్ పాత్ర.. జ్యోతికృష్ణ క్లారిటీ

Exit mobile version