Site icon NTV Telugu

War2 : ఫ్యాన్స్ ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన తారక్ – హృతిక్..

War 2

War 2

బాలీవుడ్‌ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన ‘వార్’ చిత్రం ఫ్యాన్స్‌ మధ్య భారీ హైప్ సృష్టిస్తోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్, టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము లేపడంతో పాటు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీతో పాటు తెలుగు మార్కెట్లో కూడా వార్ 2 సత్తా చాటుతుంది. వర్కింగ్ డే విడుదల అయినప్పటికీ, ఆగస్టు 15 హాలిడే కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబడుతుంది.

Also Read : Kangana : నెలసరి సమయంలో 12 గంటల పర్యటన.. టాయిలెట్ సౌకర్యం లేదు – ఆవేదన వ్యక్తం చేసిన కంగనా

ఈ విపరీతమైన మద్దతును చూసి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన సోషల్ మీడియా పోస్టులో ఆయన ఇలా తెలిపారు.. “War 2 మీద మీరు చూపిస్తున్న ప్రేమ అద్భుతం. ఆ ప్రేమకి నేను కూడా ప్రతీకగా ప్రేమిస్తున్నాను. మేము ఎంతో ప్యాషన్‌తో రూపొందించిన ఈ సినిమా, మీరు ఇస్తున్న మద్దతుతో మరింత బలపడింది. రెడీ అవ్వండి లెట్స్ గో’ అంటూ తెలిపారు. అలాగే హృతిక్ కూడా ‘2019లో పరిచయమైన కబీర్ పాత్ర నా జీవితంలోనే ప్రత్యేక స్థానం సంపాదించింది. నటుడిగా నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమా హాళ్లలో మీరు చూపిన ఉత్సాహం, అభిమానం సపోర్ట్ చూసి కబీర్ పాత్ర మరింత గొప్పగా కనిపిస్తుంది. ప్రతి అభిమానికి నా అభినందనలు. మీరు పంచిన ప్రేమ నా హృదయాన్ని నింపింది’ అని తెలిపారు. ఈ ఇద్దరు మాటలతో మూవీ పై హైప్ మరింత బలపడింది.

 

Exit mobile version