NTV Telugu Site icon

Waltair Veerayya Trailer: సోషల్ మీడియాని తాకనున్న ‘వీరయ్య తుఫాన్’

Walatir Veerayya Trailer

Walatir Veerayya Trailer

రానున్న ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ తీరం తాకనుంది, ఈదురు గాలులు వీయనున్నాయి అనే మాటలని వాతావరణం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇలాంటి మాటలే ఇప్పుడు ఒక సినిమా గురించి వినబోతున్నాం… అవును రానున్న ఇరవై నాలుగు గంటల్లో సోషల్ మీడియాలో మెగా తుఫాన్ తాకనుంది, మాస్ పూనకలు ప్రతి ఒక్కరినీ ఆవహించానున్నాయి. అదేంటి అప్పుడే మాస్ పూనకలా? పూనకలు ;లోడింగ్ కి జనవరి 13 వరకూ టైం ఉంది కదా అనుకుంటున్నారా? అస్సలు లేదు, వాయు వేగంతో తెలుగు రాష్ట్రాలని చుట్టేయడానికి ‘తుఫాన్ అంచున తప్పస్సు చేసే వశిష్టుడిలా’ మెగాస్టార్ రాబోతున్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లు మాస్ మూలవిరాట్ చిరంజీవికి మాస్ మహారాజ్ రవితేజ కూడా కలవడంతో ‘వాల్తేరు వీరయ్య’ అనే తుఫాన్ కాస్త సునామీగా మారింది. జనవరి 8న వైజాగ్ లో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసి అక్కడ, వాల్తేరు వీరయ్య ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని వదిలి, సంక్రాంతికి మెగా మాస్ ఎలా ఉంటుందో థియేటర్స్ లో చూస్తారు… అప్పటివరకూ సాంపిల్ గా ఈ ట్రైలర్ ఉంచండి అనే స్టేట్మెంట్ ని ఇస్తారు అనుకుంటే సినీ అభిమానులందరికీ స్వీట్ షాక్ ఇస్తూ ట్రైలర్ ని అనుకున్న దానికి కన్నా ముందే, ప్రీరిలీజ్ ఈవెంట్ కన్నా 24 గంటల ముందే, ఇప్పటినుంచి మరో ఇరవై నాలుగు గంటల లోపే ‘వాల్తేరు వీరయ్య ట్రైలర్’ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఊహించని ఈ అప్డేట్ బయటకి రావడంతో ట్విట్టర్ ని మెగా అభిమానులు షేక్ చేస్తున్నారు. మెగా మాస్ పూనకలు ఎలా ఉండబోతున్నాయో చూడబోతున్నారు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది కానీ రేపు బయటకి రానున్న వాల్తేరు వీరయ్య ట్రైలర్ మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతోంది. సంక్రాంతి ఫైట్ సోలోగా ఉండదు, స్ట్రాంగ్ గానే ఉంటుంది అని చెప్పే రేంజులో ఉంటుంది. సో వీరయ్య తుఫాన్ తీరం తాకే వరకూ ఎదురు చూద్దాం.

Show comments