Waltair Veerayya: మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాబీ దర్శకత్వంలో చిరు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. సినిమా నుంచి ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ ట్రాక్ అనడం కాదు కానీ వీరయ్య వ్యక్తిత్వం గురించి ఈ సాంగ్ లో చెప్పుకొచ్చారు. చంద్రబోస్ రాసిన అచ్చ తెలుగు పదాలు.. ఇప్పుడు వస్తున్న ఇంగ్లీష్ పాటలు విని విని విసుగెత్తిపోయిన చెవుల తుప్పు వదిలించేలా ఉన్నాయి.
‘భగ భగ భగ భగ మండే.. మగ మగ మగ మగ మగాడురా వీడే’ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. తుపాకుల మధ్య వీరయ్య ఎంట్రీ థియేటర్ లో చూస్తే మెగా ఫ్యాన్స్ సీట్లు ఉంచరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సాంగ్ లో చిరు ఎంట్రీ ఆ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా చిరును ఇందులో చూసినవారికి గ్యాంగ్ లీడర్ గుర్తుకురాక మానదు. అప్పటికి, ఇప్పటికి చిరు లో అదే గ్రేస్.. అదే మాస్.. అదే రాజసం.. అదే పౌరుషం.. సాంగ్ మొత్తం కనిపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, అనురాగ్ కులకర్ణి బేస్ వాయిస్ సాంగ్ ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాయి. ఇక మేకింగ్ వీడియోలో చరణ్ కనిపించడంతో మెగా ఫ్యాన్స్ మరింత సంబరపడుతున్నారు. ఈ పాట చూసాకా బాబీ.. మెగా అభిమాని అనిపించుకున్నాడు అని చెప్పకుండా ఉండలేరు.. చిరు ఈ రేంజ్ మాస్ లుక్ లో చూసి ఎన్నో ఏళ్ళు అవుతోంది. నిజంగా ఈ సాంగ్ చూస్తే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది.
