Site icon NTV Telugu

Veerayya: ఓవర్సీస్ ని కమ్మేసిన మెగా తుఫాన్…

Waltair Veerayya

Waltair Veerayya

గత మూడు సినిమాలుగా సినీ అభిమానులని కాస్త నిరాశ పరుస్తున్న చిరు, మెగా తుఫాన్ గా మారి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చిన చిరు, ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాడు. ప్రీమియర్స్ నుంచే మొదలైన చిరు ర్యాంపేజ్ ఎక్కడా స్లో అయినట్లు కనిపించట్లేదు. రెండు రోజుల్లోనే మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమా, మెగాస్టార్ హిట్ కొడితే కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో ప్రూవ్ చేసింది. 1.3 మిలియన్ మార్క్ ని రీచ్ అయిన వీరయ్య సినిమా నెక్స్ట్ టార్గెట్ 2 మిలియన్ డాలర్స్. దాదాపు ఫస్ట్ సండే కంప్లీట్ అయ్యే లోపే వాల్తేరు వీరయ్య సినిమా 2 మిలియన్ మార్క్ తో పాటు బ్రేక్ ఈవెన్ ని కూడా చేరుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కదలడంతో వాల్తేరు వీరయ్య సినిమాకి ఓవర్సీస్ లోనే కాదు ఇండియాలో కూడా సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. థియేటర్స్ అన్ని ప్యాక్డ్ అయ్యి, ఓవర్ ఫ్లోస్ చూస్తున్నాయి.

Read Also: Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమా చూసిన అల్లు అర్జున్.. అది చూపించడానికేనా..?

నైజాం నుంచి సీడెడ్ వరకూ అన్ని సెంటర్స్ లో మెగా మేనియా నడుస్తోంది, సంక్రాంతి సెలవలు అయిపోవడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి చిరు బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇప్పట్లో ఆగదు. మైత్రీ మూవీ మేకర్స్ థియేటర్స్ కౌంట్ కాస్త పెంచితే వాల్తేరు వీరయ్య సినిమా మరిన్ని కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. యువీ క్రియేషన్స్ చేతిలో ఉన్న థియేటర్స్, దిల్ రాజు వారసుడు కోసం బ్లాక్ చేసిన థియేటర్స్ కూడా ఓపెన్ అయితే చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా వాల్తేరు వీరయ్య నిలిచే ఛాన్స్ ఉంది. మరి రీఎంట్రీ తర్వాత చిరు మ్యాజిక్ మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతున్న వాళ్లు, వింటేజ్ చిరుని చూపించిన వాల్తేరు వీరయ్య సినిమాని ఎంత దూరం తీసుకోని వెళ్తారో చూడాలి.

Exit mobile version