NTV Telugu Site icon

Chiranjeevi: ‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’…

Chiranjeevi

Chiranjeevi

‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’… అనే టైటిల్ చూసి అదేంటి చిరు లాస్ట్ మూడు సినిమాలే కదా ఫ్లాప్ అయ్యింది, అంతక ముందు హిట్ కొట్టాడు కదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకోకండి. 2007 నుంచి 2017 వరకూ దశాబ్దం పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న చిరు రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150తో నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నటించిన సైరా సినిమాతో కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టి చిరు మరోసారి నాన్-బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. రీఎంట్రీ తర్వాత చిరు నటించిన ఈ రెండు సినిమాలు బాగానే ఆడాయి కానీ ఈ ఆర్టికల్ హెడ్డింగ్ లో ఉంది, చిరు రీమేక్ సినిమాల గురించి కాదు. 2002లో చిరు నటించిన ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆ తర్వాత నుంచి చిరు బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాలు చేశాడు. రీమేక్ కథలతో చేసిన శంకర్ దాదా MBBS, ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలు సాలిడ్ హిట్స్ గా నిలిచాయి.

వీటి మధ్యలో ఒరిజినల్ కంటెంట్ తోనే అంజి, అందరివాడు, జై చిరంజీవ, ఆచార్య సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఒక్కటి కూడా చిరు స్థాయికి తగ్గ హిట్ గా నిలవలేదు. అంటే ఇంద్ర సినిమా తర్వాత చిరు స్ట్రెయిట్ తెలుగు కథతో హిట్ కొట్టలేదు. మళ్లీ ఇప్పుడు 2023 సంక్రాంతి చిరు స్ట్రెయిట్ కథతో వాల్తేరు వీరయ్య సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ మెగా మాస్ మూవీ రిలీజ్ అయ్యి వన్ వీక్ అవుతున్నా కలెక్షన్స్ డ్రాప్ కనిపించట్లేదు అంటే చిరు ఏ రేంజ్ హిట్ కొట్టాడో అర్ధం చేసుకోవచ్చు. అమలాపురం నుంచి అమెరికా వరకూ ప్రతి చోటా చిరు బాక్సాఫీస్ ర్యాంపేజ్ జరుగుతూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర బాస్ ఊచకోతకి అయిదు రోజుల్లోనే 120 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇదే ట్రెండ్ కంటిన్యు అయితే చిరు నాన్-రాజమౌళి రికార్డులని క్రియేట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికైనా బాస్ రేంజ్ అర్ధం చేసుకోని రీమేక్స్ కాకుండా మంచి కథలతో సినిమాలు చేస్తే మెగా తుఫాన్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడం గ్యారెంటి.

Show comments