Site icon NTV Telugu

Dasari Kiran : వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్

Dasaru Kiran

Dasaru Kiran

Dasari Kiran : ఆర్జీవీ డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఆయన్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. దాసరి కిరణ్‌ కు దగ్గరి రిలేటివ్ అయిన గాజుల మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. తన వద్ద కిరణ్‌ రెండేళ్ల క్రితం అప్పుడు కింద రూ.4.5 కోట్లు తీసుకున్నాడని.. అప్పటి నుంచి అడుగుతున్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మహేశ్ తెలిపారు. ఈ నెల 18న విజయవాడలోని కిరణ్ ఆఫీసుకు మహేశ్ తన భార్యను తీసుకుని అప్పు అడిగేందుకు వెళ్లారు.

Read Also : JR NTR : ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అమ్మాయి..

ఆ సమయంలో కిరణ్ తో పాటు అతని అనుచరులు 15 మంది తమపై దాడి చేశారని మహేశ్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహేశ్ కు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. దాసరి కిరణ్ కుమార్ గతంలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన వ్యూహం సినిమాకు నిర్మాతగా వ్యవహరించి పాపులర్ అయ్యారు. ఆ సినిమా అప్పట్లో ఓ సెన్సేషనల్ గా నిలిచింది.

Read Also : JR NTR Fans Press Meet : టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ ను సస్పెండ్ చేయాల్సిందే.. ఫ్యాన్స్ డిమాండ్

Exit mobile version