NTV Telugu Site icon

Vyuham censor: ఎట్టకేలకు సాధించిన వర్మ.. వ్యూహం సెన్సార్ చేయించాడుగా!

Vyuham

Vyuham

Vyuham Censor Formalities Completed: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’కి సెన్సార్ ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా ఎప్పుడో నవంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. అప్పట్లో సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింద, ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.

Ravi Teja – Harish Shankar: రవితేజ, హరీష్ శంకర్ సినిమా మొదలు.. కానీ బ్యానర్ మారింది!

‘వ్యూహం’ సినిమాతో పాటు పార్ట్-2ని ‘శపథం’ పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. ‘వ్యూహం’ సినిమాని నవంబర్ 10న, ‘శపథం’ మూవీని జనవరి 25న ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి ముందు ప్లాన్ చేశారు. జగన్ జీవితంలోని కొన్ని ప్రత్యేక ఘటనలను ఈ రెండు సినిమాల్లో చూపెట్టబోతున్నామని ఆర్జీవీ ప్రకటించారు. ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళన నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, జగన్ భార్య వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ అయినట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాదు ఇది బాడ్ పీపుల్ కి బాడ్ న్యూస్ అంటూ ఆయన పేర్కొనడం హాట్ టాపిక్ అయింది.