NTV Telugu Site icon

Vyooham Trailer: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వ్యూహం కొత్త ట్రైలర్.. మాములుగా లేదుగా

Vyooham

Vyooham

Vyooham Trailer: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సెన్సేషన్ సినిమా రాబోతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ మూవీ మొదటి పార్ట్ వ్యూహం ఫిబ్రవరి 23 న రిలీజ్ అవుతుండగా.. సెకండ్ పార్ట్ శపథం మార్చి 1 న రిలీజ్ కానుంది. ముఖ్యమంత్రి జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా.. వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఎన్నో వివాదాలకు దారితీసింది. నారా లోకేష్ ఈ సినిమాను ఆదుకోవడానికి హైకోర్టుకు వెళ్లినా.. వర్మ ఆ అడ్డంకులను దాటి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను వర్మ రిలీజ్ చేశాడు.

ట్రైలర్ లో మొత్తం ఏపీ రాజకీయాలను దింపేశాడు. జగన్ నుంచి లోకేష్ వరకు ఒక్కరిని వదలకుండా వాడేశాడు. చంద్రబాబు, పవన్ పొత్తు.. పవన్ పై నారా లోకేష్ పెట్టుకున్న కోపం.. జగన్ జైలుకు వెళ్లడం, భారతికి రాజకీయాలు నేర్పించడం.. జగన్ సీఎం అవ్వడం.. జగన్ ను కిందకు దించడానికి చంద్రబాబు వేసిన పథకాలు. చిరంజీవి, పవన్ కు రాజకీయాలు వద్దు అని చెప్పడం.. అయినా పవన్ వినకపోవడంతో చిరు.. పవన్ నుంచి దూరమవ్వడం.. ఇలా ఒకటని కాదు. గత కొన్నేళ్లుగా ఏపీలో జరుగుతున్న రాజకీయాలను మొత్తం ఈ ఒక్క ట్రైలర్ లోనే చూపించాడు. చంద్రబాబును పాముగా జగన్ పోల్చడం.. పవన్.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే సీఎం పదవి కావాలని అడగడం .. ఇలా మొత్తం ట్రైలర్ వివాదస్పదంగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి వివాదాలను తీసుకొచ్చిపెడుతుందో చూడాలి.