Site icon NTV Telugu

Vyjayanthi Movies: ఈ ప్రపంచం అందంగా ఉంది…

Vyjayanthi Movies

Vyjayanthi Movies

యంగ్ హీరో సంతోష్ శోభన్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం సంతోష్ శోభన్ కి అందని ద్రక్షాగానే ఉంది. 2023 స్టార్ట్ అయ్యి రెండు నెలలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి కానీ ఇప్పటికే సంతోష్ శోభన్ రెండు సినిమాలని రిలీజ్ చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్యాడ్ రిజల్ట్ నే ఫేస్ చేశాయి. ఈసారి మాత్రం కాస్త గ్యాప్ తీసుకోని సమ్మర్ లో ‘అన్ని మంచి శకునములే’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు సంతోష్ శోభన్. భారి బడ్జట్ సినిమాలతో పాటు విషయం ఉన్న చిన్న సినిమాలని కూడా ప్రొడ్యూస్ చేస్తున్న వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ మూవీని నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అన్ని మంచి శకునములే సినిమా గతేడాది డిసెంబర్ 21నే విడుదల కావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ డిలే అయ్యింది.

తాజాగా మార్చ్ 4న ‘అన్ని మంచి శకునములే’ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యనున్నారు. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, టీజర్ కన్నా ముందు ‘అన్ని మంచి శకునములే’ సినిమా ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసే పనిలో ఉన్నారు. వరసగా ఒక్కో క్యారెక్టర్ ని రివీల్ చేస్తున్న మేకర్స్… ఇప్పటివరకూ నరేష్, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్, గౌతమీ, రావు రమేష్ పాత్రలకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ చాలా లైవ్లీగా ఉండి, ఒక పాజిటివ్ ఫీల్ ని తెచ్చేలా ఉన్నాయి. టీజర్ కూడా బాగుంటే సంతోష్ శోభన్ ఫ్లాప్ స్ట్రీక్ కి బ్రేక్ వేసి ‘అన్ని మంచి శకునములే’ సినిమా హిట్ అవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

 

 

Exit mobile version