NTV Telugu Site icon

Sound Party: వీజే స‌న్నీ ‘సౌండ్ పార్టీ’కి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

Sound Party

Sound Party

VJ Sunny’s ‘Sound Party’ poster Launched by MLC Kalvakuntla Kavita: వీడియో జాకీ అంటే అదేనండీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సన్నీ సీరియల్స్ లో అనేక పాత్రలు పోషించి బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. ఇక ఈ మధ్య అన్ స్టాపబుల్ మూవీతో అలరించిన ఆయన ఇప్పుడు ‘సౌండ్ పార్టీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై, ప్రొడక్షన్ నెం. 1గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వి.జె స‌న్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లుగా పేపర్ బాయ్ డైరెక్టర్ జయ శంకర్ సమర్పణలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ ను తాజాగా ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవిష్క‌రించారు.

TFCC: నంది పురస్కారాల పేటెంట్ ప్రభుత్వానిది.. ఎవరు పడితే వారు ఇవ్వద్దు: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక వ్యాఖ్యలు

ఈ సంద‌ర్భంగా క‌ల్వ‌కుంట్ల క‌విత మాట్లాడుతూ సౌండ్ పార్టీ టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయని, కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోందని అన్నారు. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు , న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా అని ఆమె అన్నారు. ఇక హీరో వీజే స‌న్ని మాట్లాడుతూ మా సౌండ్ పార్టీ సినిమా పోస్ట‌ర్ ఎమ్మెల్సీ క‌విత లాంచ్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చిందని, షూటింగ్ అంతా పూర్త‌యిందని అన్నారు. సినిమా అనుకున్న దానిక‌న్నా చాలా బాగా వచ్చిందని ఆయన అన్నారు. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, ఇంటూరి వాసు, చలాకి చంటి, వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు.