NTV Telugu Site icon

VJ Sunny : సౌండ్ ‘పార్టీ చేయడానికి వచ్చేస్తున్నాడు

Sound Party

Sound Party

VJ Sunny Sound Party to Release on November 24th: బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకి రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడుగా తెరకెక్కిన ఈ సినిమా టీజ‌ర్, పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేస్తున్న క్రమంలో ఈ సినిమా వ‌రల్డ్ వైడ్ గా ఈ నెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

ఈ సంద‌ర్భంగా ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ ఇప్ప‌టికే విడుద‌లైన మా సౌండ్ పార్టీ చిత్రం టీజ‌ర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి, బిజినెస్ ప‌రంగా కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజ‌ర్ లోని డైలాగ్స్ , వీజే స‌న్ని , శివ‌న్నారాయ‌ణ కెమిస్ట్రీ బాగా కుదిరిందంటున్నారని, ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం, వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ నెల 24న గ్రాండ్ గా సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం అన్నారు. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ నిర్మాత‌లు ఇచ్చిన ఫ్రీడంతో స‌మ‌ర్ప‌కులు జ‌య శంక‌ర్ స‌పోర్ట్ తో సినిమాను అనుకున్న విధంగా తీయ‌గ‌లిగానని, ఇటీవ‌ల సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీల‌య్యామని అన్నారు. మా సినిమాకి ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇచ్చిన స‌పోర్ట్ వ‌ల్లే ఒక మంచి సినిమా చేయ‌గ‌లిగానని ఇప్ప‌టికే టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిందని అన్నారు.

Show comments