NTV Telugu Site icon

Vj Sunny : తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సన్నీ..

Whatsapp Image 2023 06 29 At 2.32.37 Pm

Whatsapp Image 2023 06 29 At 2.32.37 Pm

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ క్రేజ్ ను అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు విజే సన్నీ.. బిగ్ బాస్ సీజన్ ముగిసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత వరుసగా అవకాశాలను అందుకున్నాడు సన్నీ. సకల గుణాభిరామ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.అలాగే ఓటీటీలో ఏటీఎం అనే సినిమాలో కూడా నటించాడు సన్నీ. అలాగే ఇటీవల అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ అనే సినిమాలో కూడా నటించాడు..ఈ సినిమాను డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా మీద సన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అతనికి నిరాశే ఎదురైంది.ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో కొత్త సినిమాను వీజే సన్నీ ప్రకటించారు. తాజాగా తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు సోషల్ మీడియా లో ఒక బజ్ ను క్రియేట్ చేసాడు సన్నీ.ఒక రాజకీయ పార్టీ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. కానీ ఈ రేంజ్ బిల్డప్ చూసి ఇది ఏదో సినిమా గురించేలే అని అంతా కూడా అనుకున్నారు. అయితే వారు అనుకున్నదే నిజం అయింది.

సౌండ్ పార్టీ అనే టైటిల్ తో ఒక కొత్త సినిమాను వీజే సన్నీ ప్రకటించాడు.. ఈ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని సారథి స్టూడియోలోజరిగినట్లు సమాచారం.సినీ జర్నలిస్టుల చేతుల మీదుగా సౌండ్ పార్టీ లోగోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హీరో వీజే సన్నీ మాట్లాడుతూ.. నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ ప్రకటించగానే నాకు చాలా మంది నుంచి ఫోన్స్ వచ్చాయి. సౌండ్ పార్టీ టైటిల్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీడియా మిత్రుల చేతుల మీదుగా మా సినిమా టైటిల్ లోగో ను లాంచ్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా సినిమా నిర్మాత అమెరికా లో ఉంటూ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను పూర్తి చేయడానికి సహకరించారు. మా దర్శకుడు సంజయ్ కూడా ఎంతో చక్కగా సినిమాను తీశాడు. జయశంకర్ కూడా అన్నీ తానై సినిమాను ముందుకు నడిపించాడు. సౌండ్ పార్టీ థియేటర్లో భారీగా సౌండ్ చేస్తుందని ధీమా వ్యక్తం చేసాడు సన్నీ..