NTV Telugu Site icon

VJ Sunny: దొంగతనం చేసి పారిపోయిన బిగ్ బాస్ విన్నర్.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్

Sunny

Sunny

VJ Sunny: భూమి మీద ఉన్న మనిషి ఎవరైనా డబ్బు కోసమే జీవిస్తాడు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బు ఎంతటివారినైనా మార్చేస్తోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ విజె సన్నీ.. కొన్ని లక్షల్లో డబ్బును దొంగతనం చేసి పారిపోతూ అడ్డంగా దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ క్లిప్ లో సన్నీ.. డబ్బు కట్టలు ఉన్న ఒక బ్యాగ్ ను తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కారు దగ్గరకు రాగానే ఆ బ్యాగ్ కిందపడి.. బ్యాగ్ లో ఉన్న డబ్బులు బయటపడ్డాయి. ఆ డబ్బులను గబగబా బ్యాగ్ లో వేసుకొని కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో నిజమైందా..? లేక ఫేకా అనేది తెలియాల్సి ఉంది.

ఇక కొంతమంది ఈ వీడియో ఫేక్ కాదు కానీ.. సినిమా ప్రమోషన్స్ కోసం సన్నీ ఇలా చేశాడంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం అన్ స్టాపబుల్. డైమండ్ రత్నంబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా కథను బట్టి అందులో సన్నీ దొంగగా కనిపిస్తున్నాడు.. డబ్బు చుట్టూ తిరిగే కథ కాబట్టి ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నట్లు ఈ ప్రాంక్ వీడియో చూస్తుంటూనే తెలుస్తోందని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ నిజంగా దొంగతనం చేస్తే సీసీటీవీ ఫుటేజ్ అంత క్లియర్ గా కనిపిస్తుందా..? సన్నీ అంత దైర్యంగా ముఖాన్ని చూపించగలడా..? అంటూ నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్లో సన్నీ అలా కనిపించే క్లిప్స్ ఇంటర్నెట్లో తిరిగే వరకు ఎవరూ ఈ విషయాన్ని గురించి పట్టించుకోలేదు. ఈ ఫుటేజ్ చూసాకా అన్నా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు. దాని గురించి ఎందుకు ఆరా తీయలేదు..? అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ప్రమోషన్స్ చాలానే చూసాంలే అంటూ అభిమానులు లైట్ తీసుకుంటున్నారు. మరి ఈ వీడియోపై సన్నీ బయటికివచ్చి వివరణ ఇస్తాడేమో చూడాలి.

Show comments