Vivek Agnihotri Strong Counter To Kareena Kapoor: ‘బాయ్‌కాట్ బాలీవుడ్’, ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’ ట్రెండ్స్‌కి ఆమిర్ ఖాన్ సినిమా బలి అయ్యింది. జనాల నుంచి ఆదరణ లభించకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇందులో కథానాయికగా నటించిన కరీనా కపూర్.. ‘లాల్ సింగ్ చడ్డా’ ఒక మంచి సినిమా అని, ఇలాంటి చిత్రాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్ల పాటు 250 మంది ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని వాపోయింది. ఆమె వ్యాఖ్యలపై తాజాగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. తనదైన శైలిలో ఆమెకు, అలాగే బాలీవుడ్ డాన్స్‌కి కౌంటర్స్ వేశాడు.
బాలీవుడ్ కింగ్స్‌గా చెలామణీ అవుతోన్న కొందరు వ్యక్తులు.. ఎందరో దర్శకులు, ఔట్‌సైడర్స్, రచయితల కెరీర్‌లు నాశనం చేసినప్పుడు, ఎందుకు వారికి వ్యతిరేకంగా బాలీవుడ్ నోరు మెదపలేదు? అంటూ వివేక్ అగ్నిహోత్రి ప్రశ్నించాడు. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని బాలీవుడ్ డాన్స్ నాశనం చేసినప్పుడు, వాళ్ల షోలను మల్టీప్లెక్సుల నుంచి తొలగించినప్పుడు, క్రిటిక్స్ గ్యాంగ్ మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు.. ఆ సినిమా కోసం ఎంతో శ్రమించిన 250 మంది పేదవాళ్ల గురించి ఎందుకు ఆలోచించలేదు? అంటూ నిలదీశాడు. ‘బాలీవుడ్ డాన్‌ల ఆహంకారం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు.. వారిని వేడి కాఫీలో ముంచేస్తారు’ అంటూ ఘాటూ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కాగా.. వివేక్ అగ్నిహోత్రి తీసిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రం.. రూ. 230 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో సరికొత్త సంచలనాల్ని నమోదు చేసింది. మరోవైపు.. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘లాల్ సింగ్ చడ్డా’ ఆగస్టు 11న విడుదలైంది. ఆమిర్ ఖాన్‌లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక నానా తంటాలు పడుతోంది. ఇది ఆమిర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవబోతున్నట్టు సమాచారం.
