Site icon NTV Telugu

Viva Harsha : లగ్జరీ కారు కొన్న వైవా హర్ష.. ఎన్ని కోట్లో తెలుసా..?

Viva Harsha

Viva Harsha

Viva Harsha : కమెడియన్ గా వైవా హర్ష వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గానే సారంగపాణి జాతకంలో కీలక పాత్ర చేసి మెప్పించాడు. పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్నా.. యావరేజ్, చిన్న సినిమాల్లో మాత్రం ఎక్కువ టైమ్ ఉండే పాత్రలే చేస్తున్నాడు. గతేడాది హీరోగా ఓ మూవీ కూడా చేశాడు. కమెడియన్ గా బాగానే సినిమాలు చేస్తున్న హర్ష.. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడతాడు. మార్కెట్లోకి వచ్చే రేస్ బైకులు కొంటూ.. టైమ్ దొరికినప్పుడల్లా తన ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్ కు వెళ్తుంటాడు. తాజాగా లగ్జరీ కారును కొనేశాడు.

Read Also : KTR: సీఎం మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద అనుమానం కలుగుతుంది..

బీఎండబ్ల్యూ ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ కారు కొన్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ కారు ధర ఎంత లేదన్నా కోటి 30 లక్షల నుంచి కోటి 40 వరకు ఉంటుందంట. ఒక కమెడియన్ ఇన్ని డబ్బులు పెట్టి కారు కొన్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. కానీ హర్ష నిత్యం కార్లు, బైకులు ఇలా కొంటూనే ఉన్నాడు. ఇంతకీ అతను సంపాదించిందంతా ఇలా కార్లు కొనడానికే ఖర్చు పెడుతున్నాడా అనే అనుమానాలు రాక మానవు. ప్రస్తుతం రెండు సినిమాల్లో చేస్తున్నాడు హర్ష. అతను గతంలో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Read Also : Producers : నిన్న అరవింద్.. నేడు దిల్ రాజు.. తర్వాత ఎవరు..?

Exit mobile version