Site icon NTV Telugu

Vithika Sheru: అమ్మ ముందే కమిట్మెంట్ అన్నారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Actress Vithika Sheru

Actress Vithika Sheru

Vithika Sheru Comments on Casting Couch: తెలుగు అమ్మాయి హీరోయిన్ వితికా షేరూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరో వరుణ్ సందేశ్ తో కొన్ని సినిమాలు హీరోయిన్గా చేసి అతనితో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. అటు భర్తకి కూడా హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇద్దరూ కలిసి ఒక సీజన్ బిగ్ బాస్ కి కూడా వెళ్లారు. నిజానికి వితికా ప్రేమించే రోజుల్లో అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో లాంటి సినిమాలలో నటించింది. అయితే తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ కష్టాలను బయటపెట్టింది. తనకు పదహారేళ్ల ఉన్నప్పుడే సినిమాల మీద ఇంట్రెస్ట్ హీరోయిన్గా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టామని ఒక ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు తనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది.

Samantha: వామ్మో.. అలాంటి ఫొటో షేర్ చేసి షాకిచ్చిన సమంత?

తన తల్లి కూడా తనతో పాటు వచ్చేదని ఓ సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్పడంతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే మీ అమ్మతో మాట్లాడాలని చెప్పి నన్ను బయటికి పంపించారు. తర్వాత అమ్మతో మీ అమ్మాయి మా సినిమాలో నటించాలంటే నిర్మాతతో కమిట్ అవ్వాల్సి ఉంటుందని అన్నారట. అయితే అసలు కమిట్మెంట్ ఏంటో తెలియని మా అమ్మ అది అర్థం అవ్వక నన్ను లోపలికి పిలిపించింది. పిలిపించిన తర్వాత ఏదో కమిట్మెంట్ ఇవ్వాలంటున్నారు చూడు అసలు ఏంటో కనుక్కో అని వాళ్ళ ముందే అంది. నాకు విషయం అర్థమై వెంటనే నోచెప్పి ఆమెను బయటికి తీసుకొచ్చాను. అయితే నేను ఎందుకు నో చెప్పాను అనేది మా అమ్మకి. ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అనిపించింది అంటూ ఆమె ఎమోషనల్ అయింది.

Exit mobile version