NTV Telugu Site icon

Mega Star : విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్.. అదిరిన విజువల్స్

Vishwambhara

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.  చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర నుండి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనేది కామెంట్స్ వినిపించాయి.
Vishwambhara - Rama Raama Lyrical | Megastar Chiranjeevi | Vassishta | MM Keeravaani

కాగా నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లిరికల్ ‘ రామ రామ’ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం  అందించగా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచన చేసారు. హనుమంతుని వైభవాన్నీ తెలియజెస్తూ సాగిన సాంగ్ చాలా బాగుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ళు తర్వాత కీరవాణి మెగాస్టార్ కలయికలో వచ్చిన ఈ మొదటి సాంగ్ ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ సాంగ్ విజువల్ గా కూడా అద్భుతంగా ఉండేలా అనిపిస్తుంది.

చిరు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగా స్టార్ ఫ్యాన్స్ విశ్వంభరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిరు ఈ సినిమాతో భారీ హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. సోషియో ఫాంటాసి కథా నేపధ్యం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ టైమ్ పడుతన్న కారణంగా విశ్వంభర రిలీజ్ డిలే అవుతుందని సమాచారం. కానీ జులై 24న విశ్వంభర రిలీజ్ అని కాదు మే 9న రిలీజ్ అని కూడా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.