Site icon NTV Telugu

Nithin : తీవ్ర సమస్యల్లో ‘తమ్ముడు’.. విశ్వంభర వస్తే ఎలా..?

Tammudu News

Tammudu News

Nithin : యంగ్ హీరో నితిన్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. అసలే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న టైమ్ లో.. ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. పైగా హిట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్నాడు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వెనకే ఉన్నాడు. ఇంకేంటి అనుకుంటున్న టైమ్ లో తమ్ముడు సినిమా వరుసగా వాయిదాల బాట పడుతోంది. వాస్తవానికి ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. చివరకు జులై 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ కింగ్ డమ్ మూవీ మే 30 నుంచి జులై 4వ తేదీకి వాయిదా పడటంతో.. తమ్ముడు సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తోంది.

Read Also : Karnataka: క్రికెట్ బాల్ కోసం టీచర్‌ని కత్తితో పొడిచిన వ్యక్తి..

సరే జులై నెలలో పెద్ద సినిమాలు లేవు కదా అని అదే నెలలో 24వ తేదీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటే.. ఇప్పుడు అది కూడా బెడిసి కొడుతోంది. ఎందుకంటే జులై 24వ తేదీని విశ్వంభర మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఆ డేట్ నే కన్ఫర్మ్ చేస్తున్నారంట. ఇంద్ర రిలీజ్ అయిన డేట్ కాబట్టి ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. అసలే మెగాస్టార్ మూవీ. భారీ బడ్జెట్ తో వస్తోంది.

కాబట్టి విశ్వంభర గనక అనుకున్నట్టే జులై 24న వస్తే తమ్ముడు సినిమాను మళ్లీ వాయిదా వేసుకోవాల్సిందే. ఎందుకంటే తమ్ముడు మూవీకి పోటీ ఉండొద్దని మూవీటీమ్ భావిస్తోంది. జులై దాటితో ఆగస్టులో మళ్లీ పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. వార్-2, కూలీ సినిమాలు ఆగస్టు 14న వచ్చేస్తున్నాయి. అలా చూసుకుంటే తమ్ముడు ఇంకా ఆలస్యం అవ్వొచ్చు అంటున్నారు. లేదంటే ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేసుకుంటే ఎంతో కొంత బెటర్.

Read Also : Naga Chaitanya: నాగచైతన్య సినిమాకి అదిరే డీల్.. అమ్మేశారు!

Exit mobile version