Site icon NTV Telugu

Vishwak Sen: #VS11 మాస్ కా దాస్ వస్తున్నాడు…

Vishwak Sen

Vishwak Sen

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమా సినిమాకి మంచి వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ప్రతి సినిమాకి విశ్వక్ సేన్ తన గ్రాఫ్ తో పాటు పెంచుకుంటూ పోతున్నాడు. దాస్ కా ధమ్కీ సినిమాతో మాస్ హిట్ కొట్టిన విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘VS 11’. ఇటీవలే లాంచ్ అయ్యి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘VS 11’ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ‘VS 11’ నుంచి రీసెంట్ గా “గంగానమ్మ జాతర మొదలయ్యింది … ఈ సారి శివాలెత్తిపోద్ది” అనే క్యాప్షన్ తో ఒక ఫోటోని షేర్ చేసారు.

Read Also: The India House: పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్… హీరో అఖిల్ కాదు నిఖిల్…

విశ్వక్ సేన్ సినిమాల్లో ఇప్పటివరకూ చూడని సెటప్ లో ‘VS 11’ తెరకెక్కుతుందని ఈ ఒక్క ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది. ‘VS 11’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకి ‘VS 11’ ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మరి తన లుక్ విషయంలో పూర్తిగా కొత్తగా కనిపించనున్న విశ్వక్ సేన్ ‘VS 11’ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి. ఇదిలా ఉంటే హీరోయిన్ ఇంకా అనౌన్స్ అవ్వని ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు. యువన్ అంటేనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కేరాఫ్ అడ్రెస్ కాబట్టి ‘VS 11’కి మంచి బీజీఎమ్ వినే ఛాన్స్ ఉంది.

Exit mobile version