విశ్వక్ సేన్ చేస్తోంది ఆ కథేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అయితే… ఒక్కోసారి ఎంత సక్సెస్ ట్రాక్ లో ఉన్న వారికైనా సినిమాను సెట్ చేయడానికి ఊహకందని అడ్డంకులు ఎదురవుతుంటాయి. ప్రసన్నకుమార్ చెప్పిన ఓ కథ నచ్చి, దానిని రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఖిలాడీ చిత్రంలో నటిస్తున్న రవితేజ… ఆ తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దాంతో బహుశా అదే కథను అనుకుంటా… వరుణ్ తేజ్ కు త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ వినిపించారట. అయితే… వరుణ్ తేజ్ స్పందన ఏమిటనేది తెలియదు కానీ…. ప్రస్తుతం పాగల్ మూవీ చేస్తున్న విశ్వక్ సేన్ కు కూడా వీరు ఓ కథ చెప్పారట. దానిని విన్న వెంటనే విశ్వక్ ఓకే చెప్పేశాడట. నిజానికి విశ్వక్ సేన్ తో పాగల్ మూవీ నిర్మిస్తున్న బెక్కెం వేణుకు త్రినాథరావు నక్కినకు మంచి అనుబంధం ఉంది. ఈ దర్శక నిర్మాతలు గతంలో కలిసి సినిమాలు చేశారు. అదే అనుబంధంతో త్రినాథరావు ప్రాజెక్ట్ కు విశ్వక్ పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో చేయబోతున్నారట. దీనికి చెట్టుకింద ప్లీడర్ అనే టైటిల్ కూడా అనుకున్నారట. అయితే… గతంతో రవితేజకు ప్రసన్నకుమార్ చెప్పిన కథ ఇదే అని, సో… ఇక రవితేజ, త్రినాథ రావు నక్కిన కాంబోలో మూవీ ఉండనట్టే అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..