మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు వివాదంలో చిక్కున్న విషయం విదితమే.. సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఫ్రాంక్ వీడియో చేస్తే.. అది కాస్త వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ గొడవ కాస్తా మరో గొడవకి కారణమైంది. ఇక ఈ రెండు వివాదాలపై విశ్వక్ నోరు విప్పాడు. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే తన ధ్యేయమని, వారు బాధపడే పనులు ఎప్పటికి చేయనని చెప్పుకొచ్చాడు. తాను పడిన కష్టాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అభిమానులతో పంచుకున్నాడు. ” నిజమే నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు.. ఒక్కడినే ఇండస్ట్రీకి వచ్చాను. ఇంతపెద్ద సినిమా ఇండస్ట్రీలో చిన్న ఈగ లాంటివాడిని. నలుగురు కలిసి ఇట్లా కొడితే పడిపోతానేమో. కానీ ఆ నలుగురు కలిసి నన్ను కొట్టాలంటే నాకొక పెద్ద స్ట్రాంగ్ సెల్ ఉంది .. అది మీరే. నిన్న నైట్ నేను నా ట్విట్టర్ .. ఇన్ స్టా .. సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే .. ఒక్కొక్కడు నాకు సపోర్ట్ చేస్తుంటే దీనమ్మా ఇప్పుడు సంపాదించానురా నేను ఆస్తి అనుకున్నాను.
నన్ను ఎవరూ ఏమీ పీకలేని ఆస్తి ఇది. నా దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది. ఏం చూసుకునిరా నీకు ఇంత పొగరు అంటే .. నాకు ఉన్నారు. నాకున్నది ఎవరో డౌట్ ఉంటే హ్యస్టాగ్ విశ్వక్ సేన్ అని కొట్టండని చెప్తా.. మీరు లేకపోతే నా ప్లేస్ లో ఎవరన్నా వీక్ పర్సన్ ఉంటే ఏమన్నా చేసుకోవచ్చు.. కానీ నాకు ధైర్యాన్నిచ్చింది మీరు.. మీరు బాధపడే పని నేనెప్పటికీ చేయను మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంతకంతకు ఎక్కువ చేస్తాను. ఈ ఏడాది మరో మూడు సినిమాలతో మీ ముందుకు వస్తాను. ఐ లవ్ యూ ఆల్.. నాకోసం మీరు చేసిన ప్రతిదానికి థాంక్స్.. ఇది గుర్తుపెట్టుకుంటాను. నన్ను ఇంత స్ట్రాంగ్ గా ఉంచినందుకు థాంక్యూ సో మచ్.. నాకు మీరు తప్ప ఎవరు లేరు. థాంక్యూ సో మచ్” అని చెప్పుకొచ్చారు.
