NTV Telugu Site icon

Viswak Sen: నా మాస్ అమ్మ మొగుడు.. ఎన్టీఆర్.. అసలు సినిమా ముందుంది

Vishvak

Vishvak

Viswak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. మార్చి 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులును మెప్పించాయి.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శిల్పా కళా వేదికలో నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. మొదటినుంచి విశ్వక్ కు ఎన్టీఆర్ అంటే పిచ్చ ఇష్టమని అందరికి తెల్సిందే. ఇక ఈ వేదికపై విశ్వక్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఆస్వాదించాడు.

ఇక ఈ వేదికపై విశ్వక్ మాట్లాడుతూ.. “నమస్కారం.. ఇది నా వాయిస్ కాదు.. నందమూరి తారక రామారావు ప్రతి ఫ్యాన్ వాయిస్ ఇది. ఎందుకంటే ఈరోజు ఆయన చేసింది నా ఒక్కడి కోసం కాదు.. ఆయన అభిమాని కోసం ఇచ్చిన మాట కోసం.. నిద్రలేకపోయినా.. ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడి వరకు వచ్చాడు. మీరు నమ్మరు.. నన్ను రెండు నెలల క్రితం అన్న ఇంటికి పిలిచి ఒక తమ్ముడికి భోజనం పెట్టినట్లు పెట్టాడు. కారు వరకు వచ్చి నన్ను ఎక్కించేటప్పుడు నేను అడిగాను. అన్నా.. ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మీరు వస్తే బావుంటుంది అని.. వెంటనే నీకు మాట ఇచ్చాను.. నువ్వు వెళ్ళు అన్నారు. ఇంతలోనే ఆయన ఇంట్లో ఒక విషాదం జరిగింది. ఆయన అన్న చనిపోయారు. అలాంటి సమయంలో ఇవన్నీ ఎందుకు.. నాకే ఏదోలా అనిపించి ఏది గుర్తుచేయొద్దు అని చెప్పి నేనే సైలెంట్ గా ఉండిపోయాను. కానీ, తన అన్నకు సంబంధించిన కార్యక్రమాలన్నీ అయిపోకా.. వాడి ప్రోగ్రామ్ ఎప్పుడో కనుక్కో అని నాకు కబురు పంపాడు. అప్పుడు ఆస్కార్ కాదు.. అసలు ఆయనకు ఆస్కార్ నథింగ్. నేను ఆరోజు అనుకున్నా.. మాట మీద నిలబడే వ్యక్తి ఆయన అని. అరేయ్ నేను రావడం ఒక బాధ్యత రా అని ఆయన నాకు ఒక మెసేజ్ పంపినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.

థాంక్యూ అన్నా.. ఇండియా మొత్తం గర్వపడేలా చేశావ్.. నేను ఎప్పుడో చెప్పినా.. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే.. నా ఎన్టీఆర్ అని చెప్పా. ఇక ఆ మాస్ ఈ మాస్ కాదు.. నా మాస్ అమ్మ మొగుడు.. 17 ఏళ్లకే తొడగొట్టి బాంబ్ లు వేసిన ఆయన నాకు తెలిసి మళ్లీ హిస్టరీలో రీపీట్ కాదు. తారక్ ను ఇప్పటివరకు చూసింది టీజర్ మాత్రమే.. సినిమా ముందు ముందు కనిపిస్తుంది. ఇండస్ట్రీలో నేను హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా అన్ని పెట్టేసి సినిమా చేస్తున్నా.. దీంతో వీడు పడిపోతే బావుండు నవ్వుదాం అనుకోనేవారు.. చాలామంది ఉంటారు. కొంతమంది పనిగట్టుకొని లాగేటోళ్లు కూడా ఉంటారు. నాకు తెలిసి దేవుడు ఇవన్నీ చూసి నాకు ఎన్టీఆర్ అన్నను పంపాడు సపోర్ట్ గా.. నాకు బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయిపోయింది. జై ఎన్టీఆర్. 5 ఏళ్ళ తరువాత నేను సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. సినిమా బావుంటుంది. చివర్లో సర్ ప్రైజ్ ఒకటి ఉంటుంది.. ఈసారి నేను డిజప్పాయింట్ చేయను” అంటూ చెప్పుకొచ్చాడు.

Show comments