NTV Telugu Site icon

Vishwak Sen: విశ్వక్ సేన్ ‘లైలా’ టీజర్‌ను ఎంజాయ్ చేసిన బాలయ్య

Lila Movie

Lila Movie

భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. అందులో విశ్వక్ సేన్ ఒకడు. మంచి హిట్ కోసం చూస్తున్నా ఈ హీరో ప్రస్తుతం ‘లైల’ అనే మూవీ చేస్తున్నాడు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

అయితే బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ సెలబ్రేషన్స్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఈవెంట్ ను ఎంతో ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా బాలయ్య హీరోయిన్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఈ ఈవెంట్ లో భాగంగా విశ్వక్ తన ‘లైలా’ టీజర్‌ను మొదటగా బాలయ్యకు చూపెట్టగా.. అది చూసిన బాలయ్య తెగ ఎంజాయ్ చేశాడు. అంతేకాదు అద్భుతంగా ఉందంటూ విశ్వక్‌‌ను మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘లైలా’ మూవీ టీం సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ‘లైలా’ టీజర్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగిపొయ్యాయి. ఈ టీజర్‌ను జనవరి 17న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది

 

Show comments